Fake News, Telugu
 

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాను ఇజ్రాయిల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా వెలిగించలేదు

0

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాను ఇజ్రాయెల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా లైట్స్ తో వెలిగించారని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో దీనికి సంబంధించిన ఒక ఫోటోని కూడా షేర్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాను ఇజ్రాయెల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా లైట్స్ తో వెలిగించారు.

ఫాక్ట్(నిజం): ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు మాకు దొరకలేదు. బుర్జ్ ఖలీఫాకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఇజ్రాయిల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా లైట్స్ తో వెలిగించిన ఫోటో కాని వీడియో కాని మాకు కనిపించలేదు. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫోటో అని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సాధారణంగా ఏదైనా సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా బుర్జ్ ఖలీఫాను వెలిగించినప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు కాని వీడియోస్ కాని బుర్జ్ ఖలీఫాకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో (ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్) పోస్ట్ చేస్తూ వుంటారు. ఐతే మేము బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో వెతకగా, బుర్జ్ ఖలీఫాను ఇజ్రాయిల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా లైట్స్ తో వెలిగించిన ఫోటో కాని వీడియో కాని మాకు కనిపించలేదు. మరియు దీనికి సంబంధించిన వార్తా కథనం కూడా మాకు దొరకలేదు. ఇటీవలే స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న ఇండియా మరియు పాకిస్తాన్ దేశ జాతీయ జెండాలు ప్రతిబింబించేలా బుర్జ్ ఖలీఫాను లైట్స్ తో వెలిగించారు. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫోటో అని చెప్పొచ్చు.

పోస్టులో ఉన్న ఫోటోని Yandex లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం ఇలాంటిదే ఒక బుర్జ్ ఖలీఫా ఫోటో ఒకటి మాకు కనిపించింది. ఐతే ఈ ఫోటోలో బుర్జ్ ఖలీఫా పై ఇజ్రాయిల్ జెండా లేదు. దీన్నిబట్టి ఇజ్రాయిల్ జెండా ఫోటోషాప్ లాంటి ఒక టూల్ ద్వారా డిజిటల్ గా జత చేసి ఉంటారు అని చెప్పొచ్చు.

ఇటీవలే UAE మరియు ఇజ్రాయిల్ మధ్య 13 ఆగస్టు 2020న జరిగిన శాంతి ఒప్పందం నేపధ్యంలో ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, బుర్జ్ ఖలీఫాను ఇజ్రాయెల్ దేశ జాతీయ జెండా ప్రతిబింబించేలా లైట్స్ తో వెలిగించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll