Fake News, Telugu
 

‘1971 యుద్ధం: 3,000 భారత యుద్ధ ఖైదీలను ఇందిరా గాంధీ ప్రభుత్వం విడిపించలేదు’ అనేది తప్పుడు వార్త

0

చరిత్ర దాచిన సత్యం: బంగ్లాదేశ్ విభజన సమయంలో భారత్ పాకిస్థాన్ యుద్ధంలో దొరికిన 90,000 పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను ఇందిరా గాంధీ ప్రభుత్వం విడిచి పెట్టింది. కానీ పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న 3,000 భారత యుద్ధ ఖైదీలను విడిపించలేదు…”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్ విభజన సమయంలో దొరికిన 90,000 పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను విడిచి పెట్టిన ఇందిరా గాంధీ ప్రభుత్వం, పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న 3,000 భారత యుద్ధ ఖైదీలను మాత్రం విడిపించలేదు.

ఫాక్ట్: 1971 యుద్ధంలో భాగంగా దొరికిన సుమారు 90,000కి పైగా పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను భారత్ విడిచిపెట్టింది. 1971 యుద్ధం సందర్భంగా పాకిస్థాన్‌కి చిక్కిన భారత యుద్ధ ఖైదీలు భారతదేశానికి వచ్చేసారని, అయితే సుమారు 54 మంది ఆచూకీ మాత్రం తెలియలేదని తమకు సమాచారం అందిందని 2000లో అప్పటి మంత్రి అజిత్ కుమార్ లోక్ సభలో తెలిపారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, బంగ్లాదేశ్ విభజన సమయంలో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో భాగంగా దొరికిన సుమారు 90,000కి పైగా పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను భారత్ విడిచి పెట్టినట్టు తెలిసింది. ఇదే విషయం 2015లో ప్రధాని మోదీ కూడా చెప్పిన్నట్టు ఇక్కడ చదవచ్చు.

పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న 3,000 భారత యుద్ధ ఖైదీలను ఇందిరా గాంధీ ప్రభుత్వం విడిపించలేదని పోస్ట్‌లో చెప్పడం మాత్రం తప్పు. 617 భారత యుద్ధ ఖైదీలు పాకిస్థాన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నట్టు 1972లో ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు ఇచ్చిన రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు. ఆ ఈవెంట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

1971 యుద్ధం సందర్భంగా పాకిస్థాన్‌కి చిక్కిన భారత యుద్ధ ఖైదీలు భారతదేశానికి వచ్చేసరని, అయితే సుమారు 54 మంది ఆచూకీ మాత్రం తెలియలేదని తమకు సమాచారం అందిందని 2000లో అప్పటి మంత్రి అజిత్ కుమార్ లోక్ సభలో తెలిపారు. పాకిస్థాన్ మాత్రం తమ దగ్గర భారత యుద్ధ ఖైదీలు లేరని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయం లోక్ సభలో వివిధ సమయాల్లో అప్పటి మంత్రులు తెలిపినట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆ 54 మంది గురించి ‘బీబీసీ’ సంస్థ రాసిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. 1971 యుద్ధం, యుద్ధం తరువాత చేసుకున్న ఒప్పందం, యుద్ధ ఖైదీల విడుదల, మరియు ఇతర వివరాల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 90,000కి పైగా పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను భారత్ విడిచి పెట్టింది. పాకిస్థాన్‌కి చిక్కిన భారత యుద్ధ ఖైదీలు కూడా దాదాపు అందరు భారతదేశానికి వచ్చేసారు. అయితే, సుమారు 54 మంది గురించి మాత్రం సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll