Fake News, Telugu
 

‘రాష్ట్రంలో సంచరిస్తున్న బీదర్, గుల్బర్గా కిడ్నాప్ ముఠా, అరుపులు వినిపిస్తే తలుపులు తీయొద్దు’, అనేది ఫేక్ వార్త

0

బీదర్, గుల్బర్గా లకు చెందిన ఒక ముఠా తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తుందని, పిల్లల ఏడుపు శబ్దాలు చేసి ప్రజలు ఇళ్ల బయటికి వచ్చేలా చేస్తున్నారని, బయటికి వచ్చిన వారిని కిడ్నాప్ చేసి వారి అవయవాలను విక్రయిస్తున్నారని తెలంగాణ పోలీసులు తెలిపినట్టు ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీదర్, గుల్బర్గా లకు చెందిన కిడ్నాప్ ముఠా రాష్ట్రంలో సంచరిస్తున్నందున అరుపులు వినిపిస్తే తలుపులు తీయోద్దని తెలిపిన తెలంగాణ పోలీసులు. 

ఫాక్ట్: పోస్ట్ లోని క్లెయిమ్ మరియు ఫోటో 2017 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. అదే ఫోటో 2018 లో వైరల్ అయినప్పుడు అది ఒక ఫేక్ న్యూస్ అని సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే క్లెయిమ్ మరియు ఫోటో 2017 నుండి  సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలుస్తుంది.

అయితే, అదే ఫోటో 2018 లో వైరల్ అయినప్పుడు అది ఒక ఫేక్ న్యూస్ అని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. మరికొన్ని ఫోటోలతో ఇదే వార్త వైరల్ అయినప్పుడు, ఆ వార్త తప్పు అంటూ 2018 లోనే హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇంతకముందు ఇలాంటి వార్తలే వేరే ఫోటోలతో కొందరు పోస్ట్ చేసినప్పుడు, FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘రాష్ట్రంలో సంచరిస్తున్న బీదర్, గుల్బర్గా కిడ్నాప్ ముఠా. అరుపులు వినిపిస్తే తలుపులు తీయొద్దు’, అనేది ఫేక్ వార్త. 

Share.

About Author

Comments are closed.

scroll