Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కి సంబంధించిన పాత వీడియోని కోల్‌కతాలో ముస్లింల నిరసన ప్రదర్శనలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కోల్‌కతాలో ముస్లింల నిరసన ప్రదర్శనలు అని చెప్తూ దీనికి సంబంధించిన వీడియోతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

  ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: కోల్‌కతాలో ముస్లింలు నిరసన ప్రదర్శిస్తూ తీసిన భారీ ర్యాలీ వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మయన్మార్ లో రోహింగ్య ముస్లింలపై జరుగుతున్న అరాచాకాలకి వ్యతిరేకంగా 2017లో బంగ్లాదేశ్ లోని కొన్ని పార్టీలు బంగ్లాదేశ్ లోని మయన్మార్ ఎంబసీ దగ్గర నిరసనలు తెలిపిన ఘటనకు సంబంధించింది. ఈ వీడియోకి కోల్‌కతా ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే వీడియోలో 40వ సెకండ్ దగ్గర మనకు బంగ్లాదేశ్ జాతీయ జండా కనిపిస్తుంది. వీడియోలో నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డ్స్ బట్టి మయన్మార్ లో రోహింగ్య ముస్లింలపై జరుగుతున్న అరాచాకాలకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనగా తెలుస్తున్నది. వీడియోలో నిరసనకారులు మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అయిన ఆంగ్ సాన్ సూకీ ఫోటోలు ప్రదశించడం చూడొచ్చు. వీడియోలో ప్లకార్డ్స్ పై ‘Islami Jubo Andolan’ మరియు ‘Islami Shasantantra Chhatra Andolan’  వంటి కొన్ని బంగ్లాదేశ్ కి చెందిన పార్టీల పేర్లు చూడొచ్చు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇలాంటిందే ఒక వీడియో ‘Islami Andolon Bangladesh enclose myanmar Embassy’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో యూట్యూబ్ లో 13 సెప్టెంబర్ 2017న అప్లోడ్ చేసారు. ఈ వీడియో వివరణ ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా 13 సెప్టెంబర్ 2017న ఒక బంగ్లాదేశ్ వార్తా సంస్థ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఒక న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో, పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ ఒకేలా లేకపోయినా రెండు వీడియోల్లో నిరసనకారులు ఒకే రకమైన జెండాలు, ప్లకార్డ్స్ పట్టుకోవడం కనిపిస్తుంది. ఈ వార్తా కథనం ప్రకారం ఈ వీడియో కొన్ని పార్టీలు మయన్మార్ లో రోహింగ్య ముస్లింలపై జరుగుతున్న అరాచాకాలకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లోని మయాన్మార్ ఎంబసీ దగ్గర నిరసనలు తెలిపిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని బట్టి ఈ వీడియో బంగ్లాదేశ్ లో 2017లో జరిగిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిందని, ఈ వీడియోకి కోల్‌కతా ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాం మతం మీద చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు ప్రదేశాలలో తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కోల్‌కతాలో కూడా ‘ఆల్ బెంగాల్ మైనారిటీ యూత్ ఫెడరేషన్’ సంస్థ వారు మాక్రాన్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నిర్వహించబోయిన ర్యాలీని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబందించిన వీడియోను ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, మయన్మార్ లో రోహింగ్య ముస్లింలపై జరుగుతున్న అరాచాకాలకి వ్యతిరేకంగా 2017లో బంగ్లాదేశ్ లో నిరసన తెలిపిన ఘటన వీడియోని కోల్‌కతాలో ముస్లింలు జరిపిన నిరసన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll