Fake News, Telugu
 

2005 మరియు 2011లో కాంగ్రెస్ పార్టీ తేవాలని చూసిన బిల్లుల్లో వీడియోలో చెప్పిన చాలా వరకూ క్లాజులు లేవు

0

‘జర్నలిస్ట్ సాయి’ అనే యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ హయాంలో హిందూ బిల్ అనే పేరుతో ఒక బిల్ తీసుకొనివద్దామని అనుకుంది. మీడియా కూడా దానిని టచ్ లేదా ప్రచారం చేయలేకపోవడమే మన దౌర్భాగ్యం. బిల్లులో నిబంధనలు చూస్తే, ఆల్లర్ల సమయంలో నమోదైన మైనారిటీ కేసులను హిందూ న్యాయమూర్తులు ఎవరూ విచారించకూడదు. ఒక మైనారిటీ తన మీద వివక్ష చూపబడిందని ఆరోపిస్తే, ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు…..హిందూ ఆల్లర్ల సమయంలో మైనారిటీ వర్గంపై కేసు నమోదు చేయకూడదు, మైనారిటీ వర్గం వ్యక్తి మాత్రం మెజారిటీ వర్గంపై కేసు నమోదు చేయవచ్చు…..హిందువులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి మైనారిటీల నుండి NOC సర్టిఫికేట్ తీసుకోవాలి…..ఈ బిల్లును 2005 మరియు 2011లో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీసుకొని వచ్చింది. బీజేపీ అడ్డుకోబట్టి ఆగింది’, అంటూ ఆ వీడియోలో చెప్తున్నట్టు చూడవచ్చు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2005 మరియు 2011లో కాంగ్రెస్ పార్టీ తేవాలని చూసిన హిందూ వ్యతిరేక బిల్లులోని నిబంధనలు.

ఫాక్ట్: ‘హిందూ బిల్’ పేరుతో వీడియోలో చెప్పిన నిబంధనలు ఉన్న బిల్లును కాంగ్రెస్ తేవాలని చూడలేదు. అయితే, 2005లో ‘The Communal Violence Bill’ పేరుతో మరియు 2011లో ‘Prevention of Communal and Targeted Violence’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్లులను తీసుకొని రావాలని చూసింది. వీడియోలో చెప్పిన్నట్టు ఆల్లర్ల సమయంలో నమోదైన మైనారిటీ కేసులను హిందూ న్యాయమూర్తులు ఎవరూ విచారించకూడదని ఆ బిల్లుల్లో లేదు. అంతేకాదు, హిందువులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి మైనారిటీల నుండి NOC సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా లేదు. 2011 బిల్లులో ‘గ్రూప్’ అంటే మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ లేదా ఎస్సీ, ఎస్టీ అని ఉన్నట్టు చదవచ్చు. అయితే, ఆ బిల్లులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మాత్రం కొందరు తెలిపారు. మెజారిటీ అంటే ఎక్కువ సందర్భాల్లో హిందువులే ఉంటారని, వారు ఈ బిల్లుల ప్రకారం నష్టపోతారని వారు వాదించారు. కావున పోస్ట్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

‘హిందూ బిల్’ పేరుతో వీడియోలో చెప్పిన నిబంధనలు ఉన్న బిల్లు గురించి వెతకగా, అలాంటి పేరుతో ఆ నిబంధనలు ఉన్న ఏ బిల్లు దొరకలేదు. అయితే, 2005లో ‘The Communal Violence Bill’ పేరుతో మరియు 2011లో ‘Prevention of Communal and Targeted Violence’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్లులను తీసుకొని రావాలని చూసినట్టు తెలిసింది. ఆ బిల్లులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వీడియోలో చెప్పిన్నట్టు ఆల్లర్ల సమయంలో నమోదైన మైనారిటీ కేసులను హిందూ న్యాయమూర్తులు ఎవరూ విచారించకూడదని ఆ బిల్లుల్లో లేదు. అంతేకాదు, హిందువులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి మైనారిటీల నుండి NOC సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా లేదు. 2011 బిల్లులో ‘గ్రూప్’ అంటే మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ లేదా ఎస్సీ, ఎస్టీ అని ఉన్నట్టు చదవచ్చు. రెండు బిల్లుల్లో ‘హిందువు’ అనే పదం కూడా లేన్నట్టు గమనించవచ్చు. ఆ బిల్లులకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఆ బిల్లులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మాత్రం కొందరు తెలిపారు. మెజారిటీ అంటే ఎక్కువ సందర్భాల్లో హిందువులే ఉంటారని, వారు ఈ బిల్లుల ప్రకారం నష్టపోతారని వారు వాదించారు. వాటికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, 2005 మరియు 2011లో కాంగ్రెస్ పార్టీ తేవాలని చూసిన బిల్లుల్లో వీడియోలో చెప్పిన చాలా వరకూ నిబంధనలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll