“తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఒక ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న వై యస్ షర్మిల ఫోటోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని అంటున్న వై యస్ షర్మిల యొక్క ఫోటో.
ఫాక్ట్: “తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఒక ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న వై యస్ షర్మిల ఫోటోను ఎడిట్ చేసారు. అసలు ఫోటోలో “రైతులను అప్పుల పాలు చేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఉంది. 21 ఏప్రిల్ 2022న ఫోటోను పోస్ట్ చేసిన వై యస్ షర్మిల ట్వీట్‌లో తెలంగాణలో కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటో ఒకటి వై యస్ షర్మిల యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో లభించింది. కానీ, ట్విట్టర్ ఫోటోలో “రైతులను అప్పుల పాలు చేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ప్లకార్డ్ పై ఉన్నట్టు తెలుస్తుంది. ఫోటోను ఎడిట్ చేసినట్టు చూడొచ్చు.
21 ఏప్రిల్ 2022న ఫోటోను పోస్ట్ చేసిన ట్వీట్‌లో తెలంగాణలో కేటీఆర్ మరియు టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు. వై యస్ షర్మిల యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా ఆ రోజుకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, మరియు అక్కడ ప్లకార్డ్ చూడొచ్చు.
చివరగా, “తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఒక ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న వై యస్ షర్మిల ఫోటో ఎడిట్ చేయబడింది.