Fake News, Telugu
 

ఈ వీడియోలో అమ్మాయిని బెదిరిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు

0

ఓ వ్యక్తి ఓక అమ్మాయిని కత్తితో బెదిరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ అవుతోంది. పోస్ట్‌లో వ్యక్తి ముస్లిం అని (పోస్ట్‌లో జిహాదీ అని ఉంది), అమ్మాయి హిందువు అని ఉంది. ఈ పోస్ట్‌లో నిజానిజాలు ఎంతో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని  కత్తితో బెదిరించాడు.

ఫాక్ట్ (నిజం): ఈ  సంఘటన ఇండోర్‌లో  నిజంగానే జరిగింది. బాలికను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని ఆయుధాల చట్టం కింద కేసు కుడా నమోదు చేశారు. కాకపోతే, బెదిరించిన వ్యక్తి ముస్లిం కాదు. F.I.R కాపీలో అతని పేరు పీయూష్ రావత్ అని చూడవచ్చు. అతను ముస్లిం కాదు. అందుకే, పోస్ట్‌లో చెప్తున్న విషయం తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

సంబంధిత కీ వర్ద్స్‌తో ఇంటర్నెట్‌లో శోధించిన తర్వాత, ఇండోర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ సంఘటనపై కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. ఏబిపి లైవ్‌లో ప్రచురించిన కథనం యొక్క థంబ్‌నైల్‌లో వీడియోలో ఉన్న అదే వ్యక్తిని మనం చూడవచ్చు.

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పీయూష్ అని, తనకు తెలిసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. సంఘటనా స్థలంలో ఉన్న వారిలో ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో సాక్ష్యాల ఆధారంగా పీయూష్‌ను పట్టుకున్న పోలీసులు అతనిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల రిజిస్టర్ చేసిన F.I.R కాపీ ప్రకారం, అతని పూర్తి పేరు పీయూష్ రావత్, మరియు అతని తండ్రి పేరు భారత్ సింగ్ రావత్. వీటన్నిటి బట్టి, ఆ వ్యక్తి ముస్లిం కాదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వీడియోలో బాలికను కత్తితో బెదిరిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll