Fake News, Telugu
 

చడ్డి గ్యాంగ్ పాత ఫొటోలని చూపిస్తూ గొంతులు కోసే కొత్త గ్యాంగ్ అని చెప్తున్నారు

0

గొంతులు కోసే గ్యాంగ్ తిరుగుతుంది, తెలుగు ప్రజలు జాగ్రతగా ఉండండి అని చెప్తూ కొన్ని ఫొటోస్ తో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలుగు రాష్ట్రలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దోపిడి దొంగల ముఠాలు సంచరిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): ఒకప్పుడు చడ్డి గ్యాంగ్ ముంబై, హైదరాబాద్ లో దొంగతనాలు చేసిన వార్త నిజమైనప్పటికి, 2016 & 2017 లో ఆ గ్యాంగ్ చేసిన దొంగతనాల ఫొటోలని చూపించి ఇప్పుడు గొంతులు కోసే కొత్త గ్యాంగ్ అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఈ ఫొటోల గురించిన సమాచారం కొరకు మేము యూట్యూబ్ లో వెతకగా, పోస్ట్ లో చూపించిన ఫొటోలని పోలిన వీడియోలు చాలా కనిపించాయి.

ఫోటో 1:

ఈ ఫోటో 2016లో చడ్డి గ్యాంగ్ అనే దొంగల గ్యాంగ్ కి సంబంధించింది. ఆ గ్యాంగ్ ముంబైలో దొంగతనం చేస్తూనప్పుడు cctvలో రికార్డు అయినప్పటి ఫోటో అది. దీనికి సంబంధించిన వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.

ఫోటో 2,3,4 & 5:

ఈ ఫొటోలు 2017లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో చడ్డి గ్యాంగ్ అనే దొంగల గ్యాంగ్ దొంగతనం చేసే ప్రయత్నం లో CCTVలో రికార్డు అయినవి. దీనికి సంబంధించిన వార్త కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

పోస్ట్ లో చూపించిన చడ్డిగ్యాంగ్ తెలుగు రాష్ట్రాలలో చాలా దొంగతనాలు చేసిన మాట నిజమైనప్పటికి, అవి పాత ఫోటోలు. ఇప్పుడు కొత్తగా గొంతులు కోసే గ్యాంగ్ వచ్చి, ఇంటి ముందు చిన్న పిల్లలు ఎడిచినట్టు శబ్దం చేసి దాడి చేస్తారన్న దానిపై ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, 2016 & 2017లో చడ్డి గ్యాంగ్ చేసిన దొంగతనాలకు సంబంధించిన ఫొటోస్ ని చూపించి గొంతులు కోసే కొత్త గ్యాంగ్ గా చెప్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll