Fake News, Telugu
 

‘ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన ఉత్తర భారతదేశానికి చెందిన నేరస్తుల ఫోటోలు’ అని ఉన్నది ఫేక్ వార్త

0

ప్రజలకు అప్రమత్తంగా ఉండమని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన ఉత్తర భారతదేశానికి చెందిన నేరస్తుల ఫోటోలను శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ విడుదల చేసారని ఒక వార్తాపత్రిక ప్రచురించిన వార్తని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన ఉత్తర భారతదేశానికి చెందిన గుల్బర్గా మరియు బీదర్ ఇరానీ గ్యాంగ్ నేరస్తుల ఫోటోలు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులోని వార్తలో నిజం లేదు. తాను పంపిన ఒక పాత మెసేజ్ ని తప్పుగా అర్ధం చేసుకొని, సాక్షి రిపోర్టర్ పొరపాటున ఆ వార్తను ప్రచురించినట్టు FACTLY వారితో మాట్లాడుతూ శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ చిన్నపీరయ్య తెలిపారు. వాస్తవానికి పోస్టులోని నిందితుల ఫోటోలను గత సంవత్సరం కర్ణాటక పోలీసువారు రిలీజ్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వార్తని ‘సాక్షి’ దినపత్రిక వారు బుధవారం (22-01-2019) నాడు ప్రచురించారు

ఆ వార్త గురించి శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ చిన్నపీరయ్య తో FACTLY మాట్లాడగా, తాను పంపిన ఒక పాత మెసేజ్ ని తప్పుగా అర్ధం చేసుకొని, సాక్షి రిపోర్టర్ పొరపాటున ఆ వార్తను ప్రచురించినట్టు టూటౌన్ ఎస్ఐ తెలిపారు. ఆ వార్తలో ఎటువంటి నిజంలేదని కూడా తెలిపారు.

అయితే ఆ ఫోటోల గురించి వెతకగా, ఆ ఫోటోలను మంగుళూరు (కర్ణాటక) పోలీసు వారు రిలీజ్ చేసారని చెప్తూ జూలై-2019 వచ్చిన వార్తలు దొరుకుతాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, ఆ వార్తల గురించి ‘Alt news’ వారు 2019 లో కర్ణాటక పోలీసువారితో మాట్లాడగా, కర్ణాటక రాష్ట్రంలోని వివిధ లోకల్ పోలీసులు వారు ఆ ఫోటోలను రిలీజ్ చేసినట్టుగా తెలిపారు. కావున, ఆ ఫోటోలను రిలీజ్ చేసింది ఆంధ్ర పోలీసులు కాదు.

అంతేకాదు, అదే ఫోటో గత సంవత్సరం తెలంగాణలో వైరల్ అయినప్పుడు, అది ఒక ఫేక్ మెసేజ్ అని హైదరాబాద్ పోలీసు వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

చివరగా, ‘ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన ఉత్తర భారతదేశానికి చెందిన నేరస్తుల ఫోటోలు’ అని ఉన్నది ఫేక్ వార్త.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll