Fake News, Telugu
 

పాత ఫోటోని పెట్టి, ‘సీఏఏ (CAA) కి మద్దతుగా వెళుతున్న యువకుడు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక ఫోటోని ఫేస్బుక్ లో పెట్టి, సీఏఏ (పౌరసత్వ సవరణ యాక్ట్) కి మద్దతుగా వెళుతున్న యువకుడు అని దాని గురించి చెప్తున్నారు. ఫొటోలోని వ్యక్తికి ఒక కాలు మాత్రమే ఉంటుంది, ఒక చేతిలో ఆర్మ్ స్టిక్ పట్టుకుని, మరొక చేతిలో జాతీయ జెండా పట్టుకుని ఉంటాడు. పోస్టులో చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సీఏఏ (CAA) కి మద్దతుగా వెళుతున్న యువకుడి ఫోటో. 

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో ఇంటర్నెట్ లో కనీసం డిసెంబర్ 2018 నుండి ఉంది. కావున, దానికీ మరియు పౌరసత్వ సవరణ యాక్ట్, 2019 (సీఏఏ) కి ఎటువంటి సంబంధం లేదు. పోస్టులో చెప్పింది తప్పు.

పౌరసత్వ సవరణ బిల్, 2019 పార్లమెంట్ లో పాస్ అయిన అనంతరం రాష్ట్రపతి సమ్మతితో యాక్ట్ (పౌరసత్వ సవరణ యాక్ట్, 2019) గా అయినట్లు ‘Live Mint’ వారి డిసెంబర్ 13, 2019 కథనం లో చూడవొచ్చు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫొటోతో ఉన్న ఒక ట్వీట్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ ట్వీట్ ద్వారా ఆ ఫోటో ఏ సందర్భానికి సంబంధించినదో తెలియలేదు, కానీ దానిని డిసెంబర్ 19, 2018 న పెట్టినట్లుగా తెలిసింది. కావున, ఫోటోకీ మరియు పౌరసత్వ సవరణ యాక్ట్, 2019 (సీఏఏ) కి ఎటువంటి సంబంధం లేదు

చివరగా, ఒక పాత ఫోటోని పెట్టి,  ‘సీఏఏకి  మద్దతుగా వెళుతున్న యువకుడు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll