స్వాతంత్ర్యం తరువాత ఇండియా బ్రిటిష్ వారి నుండి తన పేరును పొందిందని మరియు ‘INDIA’ యొక్క అర్ధం ‘Independent Nation Declared In August’ అని పేర్కొంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ కధనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇండియా అనే పేరు స్వాతంత్ర్యం తరువాత బ్రిటీష్ వారు పెట్టారు, దాని అర్ధం ‘Independent Nation Declared In August’.
ఫాక్ట్: ఇండియా అనే పదం ఇండస్ నుండి వచ్చింది, సంస్కృతంలో సింధు అని పిలవబడుతుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితం నార్త్-వెస్ట్ నుండి వచ్చిన ఇరానియన్లు మరియు గ్రీకులు ఇండస్ నదితో పరిచయం కలిగి ఉన్నారు, ఈ నదిని వాళ్ళు హిండోస్ లేదా ఇండోస్ అని పిలిచే వారు. నదికి తూర్పున ఉన్న భూమిని ఇండియా అని పిలిచేవారు. ‘ఇండియా’ అనే పదాన్ని బ్రిటిష్ వారు 18వ శతాబ్దం నుండే ఉపయోగించారు, స్వాతంత్ర్యం తరువాత కాదు. వాస్తవానికి, స్వాతంత్ర్యానికి ముందు 19వ మరియు 20వ శతాబ్దంలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన వివిధ చట్టాలు ‘ఇండియా’ అనే పదాన్ని ఉపయోగించాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఇండియా అనే పదం ఇండస్ నుండి వచ్చింది, సంస్కృతంలో సింధు అని పిలవబడుతుంది; సుమారు 2500 సంవత్సరాల క్రితం నార్త్-వెస్ట్ నుండి వచ్చిన ఇరానియన్లు మరియు గ్రీకులు ఇండస్ నదితో పరిచయం కలిగి ఉన్నారు, ఈ నదిని వాళ్ళు హిండోస్ లేదా ఇండోస్ అని పిలిచే వారు. నదికి తూర్పున ఉన్న భూమిని ఇండియా అని పిలిచేవారు. అందువల్ల, ఇండియా అనే పేరు ‘Independent Nation Declared In August’కి సంక్షిప్తనామం కాదు.
సుమారు 2500 సంవత్సరాల క్రితం పర్షియన్ల నుండి ‘హింద్’ గురించి జ్ఞానాన్ని పొందిన గ్రీకులు దానిని ‘ఇండస్’ చేశారు, మరియు మాసిడోనియన్ పాలకుడు అలెగ్జాండర్ క్రీ.పూ. మూడవ శతాబ్దంలో భారతదేశంపై దాడి చేసే సమయానికి, ‘ఇండియా’ సింధునది కి ఆవల ఉన్న ప్రాంతంతో గుర్తించబడింది. అందువల్ల స్వాతంత్ర్యం తరువాత బ్రిటిష్ వారు ‘ఇండియా’ అనే పేరును ఇవ్వలేదు, అది అంతకు ముందు నుంచే వాడుకలో ఉంది.
చరిత్రకారుడు ఇయాన్ జె. బారో తన వ్యాసంలో,‘హిందుస్థాన్ నుండి భారతదేశం: మారుతున్న పేర్లలో మార్పును పేర్కొంటూ,18వ శతాబ్దం చివరి నుండి, బ్రిటిష్ మాప్స్ ఎక్కువగా ‘ఇండియా’ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి, ప్రధానంగా 16వ శతాబ్దం నుండి ఉపయోగించిన ‘హిందుస్థాన్’ దక్షిణాసియా మొత్తంతో తన అనుబంధాన్ని కోల్పోవడం ప్రారంభించింది. కాబట్టి, ‘ఇండియా’ అనే పదాన్ని బ్రిటిష్ వారు 18వ శతాబ్దం నుండే ఉపయోగించారు కానీ స్వాతంత్ర్యం తరువాత కాదు. వాస్తవానికి, స్వాతంత్ర్యానికి ముందు 19వ మరియు 20వ శతాబ్దంలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన వివిధ చట్టాలు ‘ఇండియా’ అనే పదాన్ని ఉపయోగించాయి, దానికి ఉదాహరణ ఇక్కడ చూడవచ్చు.
“మెలూహా నుండి హిందుస్థాన్ వరకు” అనే శీర్షికతో ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం, ఇండియా, భారత్ యొక్క అనేక పేర్లు మరియు అనేక నామకరణాలు వివిధ సమయాల్లో, బహుళ సామాజిక-రాజకీయ దృక్కోణాల నుండి, మనకు ఇప్పుడు భారతదేశంగా తెలిసిన భౌగోళిక అస్తిత్వాన్ని లేదా భాగాలను వివరించడానికి వర్తింపజేయబడ్డాయి.
దేశ రాజ్యాంగం సిద్ధమవుతుండగా, దాని బహుళ సాంస్కృతిక జనాభా యొక్క మనోభావాలకు సరిపోయే విధంగా దేశానికి పేరు పెట్టడానికి సంబంధించి తీవ్రమైన వాదన జరిగింది; హరి విష్ణు కామత్, సేథ్ గోవింద్ దాస్, హర్గోవింద్ పంత్ రాజ్యాంగ సభలో తమ వాదనలు చేసినప్పుడు 1949 సెప్టెంబర్ 17న ‘యూనియన్ పేరు, భూభాగం’ అనే విభాగాన్ని చర్చకు తీసుకొచ్చారు, అయితే ఈ సూచనల్లో దేనినీ కమిటీ అంగీకరించలేదని ఈ కథనం ద్వారా తెలుస్తుంది. అందువల్ల భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్,‘ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది.’
ఇటీవల, ఇండియా పేరును భారత్ గా మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రిట్ పిటిషన్ ను ఒక నివేదనగా పరిగణించి దానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటి ఇప్పటికే ఇండియాని భారత్ గా సూచించింది అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. దీని గురించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఇండియా అనే పేరు బ్రిటీష్ వారు పెట్టలేదు, దానికి ఈ అర్ధము లేదు.