Fake News, Telugu
 

పాత సినిమా నుండి ఎడిట్ చేసిన వీడియోను ప్రపంచంలోని మొదటి రైలు వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ప్రపంచంలో మొట్ట మొదటి ట్రైన్ 24 డిసెంబర్ 1809 లో స్టార్ట్ చేసారని, అంటే దాదాపు 211 ఇయర్స్ అయ్యింది అని, ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వీడియోను అటాచ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 24 డిసెంబర్ 1809న ప్రారంభమైన ప్రపంచంలోని మొదటి రైలు వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఒక నిశ్శబ్ద చిత్రం ‘అవర్ హాస్పిటాలిటీ’ (1923) నుండి తీసింది. ఇది పీరియడ్ కామెడీ, 1830 లలో సెట్ చేయబడింది. ఈ చిత్రంలో కీటన్ ఆ టైం లో రైలులో ప్రయాణం చేసింది అందులో కనబడుతుంది. పట్టాలపై నడిపించిన మొదటి స్టీమ్ లోకోమోటివ్ 21 ఫిబ్రవరి 1804 న రిచర్డ్ ట్రెవిథిక్ (1771-1833) నడిపించాడు. స్టాక్టన్ మరియు డార్లింగ్టన్ రైల్వే 27 సెప్టెంబర్ 1825 న నడిచిన మొదటి పబ్లిక్ ప్యాసింజర్ స్టీమ్ రైలు. ప్రపంచంలో మొదటి చిత్రం 1888లో లీడ్స్ లో చిత్రీకరించబడినందున, 1809లో ఒక వీడియో/చిత్రం తీయబడటం అనేది అసంభవం. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 11 ఏప్రిల్ 2018న పబ్లిష్ చేసిన ఒక బ్లాగ్ దొరికింది. వీడియో స్క్రీన్ షాట్ లకు సరిపోయే ఒక ఇమేజ్ లోని కాప్షన్ ‘అవర్ హాస్పిటాలిటీ’లో బస్టర్ తండ్రి జో కీటన్ పైలట్ చేసిన స్టీఫెన్ సన్ యొక్క ‘రాకెట్’ లోకోమోటివ్ యొక్క ప్రతిరూపం’ చదవచ్చు. బ్లాగ్ ప్రకారం, ‘అవర్ హాస్పిటాలిటీ’ (1923), 1830 లలో సెట్ చేయబడిన పీరియడ్ కామెడీ. న్యూయార్క్ నగరంలో పెరిగిన ఒక యువకుడి (బస్టర్ కీటన్) కథను చెబుతుంది; ఈ ఇమేజ్ యొక్క ముఖ్యాంశాలలో కీటన్ టైంలో పాతకాలపు రైలులో ప్రయాణం చేసే విజువల్స్ ఉన్నాయి. మరొక బ్లాగ్ లో, అవర్ హాస్పిటాలిటీ (1923) బస్టర్ కీటన్ యొక్క 1920ల నిశ్శబ్ద హాస్య కళాఖండాలలో మొదటిది అని తెలిపారు; ఈ బ్లాగ్ లోని చిత్రాలు మరియు వీడియో యొక్క స్క్రీన్ షాట్లు ఒకదానితో మరొకటి సరిపోలి ఉన్నట్టు తెలుస్తుంది.

ఇది ‘అవర్ హాస్పిటాలిటీ’ (1923) చిత్రం నుండి ఒక సన్నివేశం కావచ్చని బ్లాగ్ కథనాల  నుండి సూచన తీసుకొని, మేము సినిమా కోసం సెర్చ్ చేసినప్పుడు ‘ట్రెలోస్ఫిలోసోఫోస్’ (trelosfilosofos) అనే ఛానెల్ అప్ లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో దొరికింది. ఈ వీడియో పేరు ‘బస్టర్ కీటన్ – అవర్ హాస్పిటాలిటీ 1923 (ఫుల్ మూవీ)‘. పోస్ట్ లోని వీడియో తీయడానికి సినిమాలో కొన్ని భాగాలను ఎడిట్ చేసి, విజువల్స్ అన్ని సినిమా నుంచి తీసినట్లు యూట్యూబ్ వీడియో ద్వారా చూడవచ్చు.

రిచర్డ్ ట్రెవిథిక్ (1771-1833), మొదట స్టీమ్ ఇంజిన్లను పట్టాలపై తీసుకొచ్చి నడిపించిన వ్యక్తి. 21 ఫిబ్రవరి 1804న, ట్రెవిథిక్ యొక్క ఇంజిన్ పెనిడారెన్ నుండి దాదాపు 10 మైళ్ళ దూరంలో 10 టన్నుల ఇనుము మరియు 70 మంది పురుషులను గంటకు 5 మైళ్ళ వేగంతో తీసుకెళ్ళిందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇంగ్లాండ్ లోని స్టాక్టన్ మరియు డార్లింగ్టన్ రైల్వే 27 సెప్టెంబర్ 1825 న డార్లింగ్టన్ నుండి స్టాక్టన్ వరకు నడిచిన మొదటి పబ్లిక్ ప్యాసింజర్ స్టీమ్ రైలు. దీని గురించి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ‘అవర్ హాస్పిటాలిటీ’లో చూపించిన రైలు 1830లో జార్జ్ స్టీఫెన్సన్ యొక్క ‘రాకెట్’ అనే లోకోమోటివ్ యొక్క మోడల్.

అంతే కాదు, 1809లో ఒక వీడియో/చిత్రం తీయబడటం అసంభవం. ఎందుకంటే మొదటి చిత్రం వాస్తవానికి 1888లో లీడ్స్ లో లూయిస్ లే ప్రిన్స్ చే చిత్రీకరించబడిందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, మనుగడలో ఉన్న తొలి చిత్రం (సెన్సిటైజ్డ్ 53.9మిమి (21/8ఇన్) వైడ్ పేపర్ రోల్) లూయిస్ ఐమ్ అగస్టిన్ లే ప్రిన్స్ (యుకె) కెమెరా నుండి వచ్చింది, అతను అక్టోబర్ 1888 ప్రారంభంలో తన మామ, జోసెఫ్ విట్లీ యొక్క తోటను రౌండ్హే, లీడ్స్, వెస్ట్ యార్క్ షైర్, (ఇంగ్లాండ్ లో ) సెకనుకు 10 నుండి 12 ఫ్రేమ్ లతో చిత్రీకరించాడు.

చివరగా, పాత సినిమా నుండి ఎడిట్ చేసిన వీడియోను ప్రపంచంలోని మొదటి రైలు వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll