Fake News, Telugu
 

తిరిగి మళ్ళీ మోదీయే అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపలేదు

0

తిరిగి మళ్ళీ మోదీయే అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపేశాడని చెప్తూ, ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ఉన్న ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరిగి మళ్ళీ మోదీయే అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపేశాడు.

ఫాక్ట్ (నిజం): తిరిగి మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపాడని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలుగాని లేక మరే ఇతర సమాచారం లేదు. ఈ ఫోటో 2018లో ఇండోనేసియాలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని తరచూ అడుగుతున్న పక్కింటి మహిళని ఒక వ్యక్తి హత్య చేసిన ఘటనకి సంబంధించింది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇలా మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపాడని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలైతే మాకు దొరకలేదు. ఒకవేళ ఇలా నిజంగానే జరిగుంటే మీడియా సంస్థలు రిపోర్ట్ చేసుండేవి, కాని దీనికి సంబంధించి మాకు ఎటువంటి పత్రికా కథనాలు గాని లేక న్యూస్ వీడియో రిపోర్ట్స్ గాని లభించలేదు.

ఐతే పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన 2018 కథనాలు మాకు కనిపించాయి. ఈ ఫోటోని ప్రచురించిన ఒక ఇండోనేషియా వార్తా కథనం ప్రకారం ఇండోనేషియాలో  ఫైజ్ నూర్దిన్ ఒక వ్యక్తి తరచూ పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అని అడుగుతుందన్న కారణంగా ఐస్య అనే తన పక్కింటి మహిళని చంపేశాడు. ఇదే విషయాన్ని ప్రచురించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

2018 లో ప్రముఖ దినిపత్రిక డెక్కన్ క్రానికల్ కూడా ఈ వార్తని ప్రచురించింది, కాకపోతే ఈ కథనంలో హత్య చేసిన వ్యక్తి ఫోటోని మాత్రం ప్రచురించలేదు. వీటన్నిబట్టి, పోస్టులోని ఈ ఫోటో ఇండోనేషియాలో 2018లో జరిగిన ఒక ఘటనకి సంబంధించిందని, ఈ ఫోటోకి భారత్ కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

ఐతే ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలతో చాలా మీమ్స్ 2018 నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అలాంటి ఒక మీమ్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి మోదీకి ఆపాదిస్తూ పోస్టులోని ఈ ఫోటోని తయారు చేసి షేర్ చేస్తున్నారు.

చివరగా, తిరిగి మళ్ళీ మోదీయే అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపలేదు.

Share.

About Author

Comments are closed.

scroll