Fake News, Telugu
 

తాను అనుకోకుండా హిందువుగా పుట్టానని జవహార్ లాల్ నెహ్రూ అనలేదు

0

ఒక న్యూస్ పేపర్ యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియా లో పెట్టి అందులో ఉన్న ఒక కోట్ ని (‘By education I am an Englishman, by views an internationalist, by culture a Muslim and a Hindu only by accident of birth’) పెట్టి అనుకోకుండా తాను హిందువుగా పుట్టానని జవహార్ లాల్ నెహ్రూ అన్నాడని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తాను అనుకోకుండా హిందువుగా పుట్టానని చెప్పిన జవహార్ లాల్ నెహ్రూ.

ఫాక్ట్ (నిజం): ఆ వ్యాఖ్య చేసింది నెహ్రూ కాదు. మొదటిసారి ఆ వ్యాఖ్యలు చేసింది ఎన్ .బి. ఖారె అనే ఒక హిందూ మహా సభ నాయకుడు; ఆయన 1959 లో తాను రాసిన ‘The Angry Aristocrat’ ఆర్టికల్ లో, నెహ్రూ తన ఆత్మ కథలో ఆ వ్యాఖ్యలు చేసాడు అని రాసాడు. కానీ, నెహ్రూ ఆత్మ కథ లో అలాంటి వ్యాఖ్యలు ఏవి కనిపించలేదు. ‘Deccan Chronicle’ పత్రిక కూడా ఆ కోట్‌ను తాము నెహ్రూకు తప్పుగా ఆపాదించామని ఒక సవరణని విడుదల చేసింది. అది ఎన్. బి. ఖారె చేసిన ఆరోపణ అని వారు అందులో పేర్కొన్నారు. కావున, ఆ క్లెయిమ్ తప్పు.

పోస్ట్ కి సంబంధించిన కొన్ని పదాలను ఇంటర్నెట్ లో వెతికితే, గౌరవ్ పంథి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ‘Deccan Chronicle’ దిన పత్రిక లో ఉన్న అదే ఫోటో ను 24 నవంబర్ 2018 న ట్వీట్ చేసారు. ఆ కోట్ ని  నెహ్రూకి తప్పుగా ఆపాదించినందుకు ఆయన తన ట్వీట్ లో ‘Deccan Chronicle’ వారు క్షమాపణ చెప్పాలని కోరారు. ఆ కోట్ కి సంబంధించి ‘Deccan Chronicle’ వారు ప్రచురించిన ‘సవరణ’ ఫోటోలని 25 నవంబర్ 2018 న ఆయన ట్వీట్ చేసాడు. ఆ సవరణ లో ‘Deccan Chronicle’ వారు నవంబర్ 19 న ‘360 ‘పేజీ లో ప్రచురించిన ఆ కోట్ జవహర్ లాల్ నెహ్రు కి తప్పుగా ఆపాదించబడిందని తెలిపారు. హిందూ మహా సభ నాయకుడు అయిన ఎన్ .బి. ఖారె 1959లో ఆ ఆరోపణ చేసారని, ఆ కోట్ కి సంబంధించి తాము చేసిన తప్పుకు చింతిస్తున్నామని తెలిపారు.

FACTLY ఆ  కోట్ లో ఉన్న పదాలు మొదటిసారిగా ఎన్ .బి. ఖారె, ఒక హిందూ మహా సభ లీడర్, 1959 లో రాసిన ‘The Angry Aristocrat’ (‘A Study of Nehru‘ అనే సంకలనంలో ఒక భాగం) అనే ఆర్టికల్ లో కనిపించాయి అని కనుక్కుంది. నెహ్రూ తన ఆత్మకథలో తనను తాను వివరిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారని ఆ ఆర్టికల్ లో ఎన్ .బి. ఖారె పేర్కొన్నారు. కానీ, ఆ కోట్ మరియు దానికి సంబంధించిన అంశాల కోసం నెహ్రూ రాసిన ‘An Autobiography‘ లో వెతికితే, ఆ కోట్‌కు సంబంధించి ఎటువంటి వివరాలు అందులో కనిపించలేదు.

అంతేకాక, కాంగ్రెస్ లీడర్, శశి థరూర్ కూడా తాను నెహ్రూ గురించి రాసిన పుస్తకం ‘Nehru: The Invention of India’ లో ఆ కోట్ గురించి ప్రస్తావిస్తూ  అది నెహ్రూ ని కించ పరచడానికి  ఎన్ .బి. ఖారె చేసిన తప్పుడు ఆరోపణలు అని, కానీ, అది నెహ్రు కి నిజమైన నివాళి అని పేర్కొన్నాడు. 

చివరగా, నెహ్రూకు తప్పుగా ఆపాదించబడుతున్న ఆ కోట్ (‘By education I am an Englishman, by views an internationalist, by culture a Muslim and a Hindu only by accident of birth’), 1959 లో ఎన్.బి. ఖరే అనే హిందూ మహా సభ నాయకుడు రాసిన ‘The Angry Aristocrat’ అనే ఆర్టికల్ లో నెహ్రూ పై చేసిన ఆరోపణ మాత్రమే. నెహ్రు ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll