Fact Check, Fake News, Telugu
 

మొబైల్ టవర్ల అనుమతి పేరుతో గత దశాబ్ద కాలంగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి

0

తమ స్థలంలో మొబైల్ టవర్ పెట్టడానికి ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (TRAI) పర్మిషన్ ఇచ్చిందని, కొంత డబ్బు రిజిస్ట్రేషన్ కి కడితే, కొన్ని లక్షల డబ్బులు అద్దె రూపంలో పొందవచ్చని తమ కుటుంబానికి కొందరు ఒక లెటర్ ని పంపించారని, ఆ లెటర్ అసలు నిజమైనదో కాదో కన్నుక్కోమని ‘FACTLY’ కి ఒకరు మెయిల్ చేసారు. ఆ లెటర్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మొబైల్ టవర్ అనుమతి కోసం కొంత రిజిస్ట్రేషన్ రుసుము కట్టమని స్థలం యజమానిని అడుగుతూ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు పంపిన లెటర్.

ఫాక్ట్ (నిజం): అది ఒక ఫేక్ లెటర్. తాము మొబైల్ టవర్లు పెట్టే ప్రక్రియలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనము అని, అలానే ఎటువంటి పన్ను లేదా రుసుము వసూలు చేయమని ఇంతకుముండు పలుసార్లు ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు వివరణ ఇచ్చారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ (DoT) వారు కూడా అవి ఫేక్ లెటర్లు అని వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

మొబైల్ టవర్లు పెట్టడానికి రిజిస్ట్రేషన్ రుసుము కట్టమని అలాంటి లెటర్లు ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు ఇస్తారో లేదో కనుక్కోవటానికి ఇంటర్నెట్ లో వెతకగా, తాము మొబైల్ టవర్లు పెట్టే ప్రక్రియలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనము అని, అలానే ఎటువంటి పన్ను లేదా రుసుము వసూలు చేయమని ఇంతకముందు పలుసార్లు ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. 2019 లో ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ని ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, మొబైల్ టవర్ల అనుమతి పేరుతో జరుగుతున్న మోసాల పై ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు 2018 లో తమ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో కూడా పెట్టినట్టు ఇక్కడ చూడవొచ్చు.

టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ (DoT) వారు కూడా ఈ విషయం పై వివరణ ఇచ్చారు. వారు రిలీజ్ చేసిన అవగాహన డాక్యుమెంట్ ని ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు,  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వారు కూడా ఫేక్ లెటర్ల ను ఫ్యాక్ట్-చెక్ చేసారు.

మొబైల్ టవర్ల అనుమతి పేరుతో మోసాలు ఈ మధ్య మొదలవలేదు. 2011 నుండి ఇదే పద్ధతిలో అనేక మోసాలు జరిగినట్టు మా పరిశోధనలో తెలిసింది. 2011 లో ఈ మోసాల పై ‘ది హిందూ’ వార్తాపత్రిక వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, మొబైల్ టవర్ల అనుమతి పేరుతో గత దశాబ్ద కాలంగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll