Fake News, Telugu
 

‘The Roentgen’s Berlin Secretery Cabinet’ ని కేరళ రాష్ట్రంలోని 150 సంవత్సరాల అల్మరాగా చిత్రికరిస్తున్నారు

0

కేరళ రాష్ట్రంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అల్మరా ఇది అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళ రాష్ట్రంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అల్మరా వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది పదేనిమిదో శతాబ్దంలో ఐరోపాకి చెందిన అబ్రహం అతని కుమారుడు డేవిడ్ రోయింట్జెన్ నిర్మించిన ‘The Roentgen’s Berlin Secretery Cabinet’. ఈ  కాబినెట్ ఇప్పుడు న్యూయార్క్ లోని ‘The Metroplitan Museum of Art’ మ్యుజియంలో ప్రదర్శనకి పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘The Met’ యూట్యూబ్ ఛానెల్ ‘25 అక్టోబర్ 2012’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. న్యూయార్క్ లోని ‘The Metropolitan Museum of Art’ మ్యుజియం వారు ఈ వీడియోని ‘The Roentgen’s Berlin Secretery Cabinet’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. వీడియోలో కనిపిస్తున్నది  పదేనిమిదో శతాబ్దంలో ఐరోపాకి చెందిన అబ్రహం అతని కుమారుడు డేవిడ్ రోయింట్జెన్ నిర్మించిన ‘The Roentgen’s Berlin Secretery Cabinet’ అని వివరణలో తెలిపారు. ఇదే వీడియోని ‘The Metropolitan Museum of Art’ మ్యుజియం వారు తమ వెబ్సైటులో షేర్ చేస్తూ, ఈ కాబినెట్ ని Frederick William II అనే రాజు కొనుకున్నట్టు అందులో తెలిపారు. ఆ తర్వాత ఈ వస్తువుని బెర్లిన్ లోని Kunstgewerbe మ్యుజియంలో పొందుపరిచారని, ఇప్పుడు న్యూయార్క్ లోని ‘The Metropolitan Museum of Art’ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని అందులో తెలిపారు.

ఈ వీడియోని ఒక యూసర్ ‘Elaborate Mechanical Furniture- The Roentgen’s Berlin Secretary Cabinet’ అనే టైటిల్ తో ‘Reddit’ వెబ్సైటులో అప్లోడ్ చేసారు. Victoria and Albert మ్యుజియం వారు కూడా ఈ కాబినెట్ గూర్చి తెలుపుతూ యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘The Roentgen’s Berlin Secretery Cabinet’ ని కేరళ రాష్ట్రంలోని 150 సంవత్సరాల అల్మరా అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll