Fake News, Telugu
 

ఈ వీడియోలోని దృశ్యాలు కైలాస మానస సరోవరంకు చెందినవి కావు.

0

టిబెట్ దేశంలో ఉన్న మానససరోవరానికి చెందిన అసలైన దృశ్యాలు అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కైలాస మానససరోవరానికి చెందిన అసలైన దృశ్యాలు ఉన్న వీడియో.

 ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్న దృశ్యాలకి కైలాస మానససరోవరానికి ఎటువంటి సంబంధం లేదు. చైనా దేశంలో ఉన్న కొన్ని వేరు వేరు పర్యాటక ప్రదేశాల యొక్క దృశాలకు సంబందించిన వీడియోలను మానససరోవరం సరస్సుకు సంబంధించినవిగా తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టులోని క్లెయిమ్ తప్పు.

పోస్టులోని  వీడియోలో ఉన్న దృశ్యాలు మానససరోవరానివి కావు. వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ పైన రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, వీడియోలో ఉన్న అనేక క్లిప్పులు చైనాలోని వేరు వేరు పర్యాటక స్థలాలకి సంబంధించినవని తెలిసింది. వాటిలో కొన్నిటికి సంబంధించిన వివరాలు కింద చూద్దాం.

మొదటి క్లిప్:

ఈ క్లిప్ యొక్క కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇందులో కనిపిస్తున్న ప్రదేశాన్ని పోలి ఉన్న ఫోటో  ఒకటి ‘iStock’ వెబ్సైటులో లభించింది. ఈ ప్రదేశం యొక్క పేరు ‘Blue Moon Valley.’

‘People’s Daily China’ వారి యూట్యూబ్ ఛానెల్లో ఈ వాలీ యొక్క వీడియో క్లిప్ ఒకటి అప్లోడ్ చేశారు. అదీ, వైరల్ వీడియోలో ఉన్న మొదటి క్లిప్ చాలా వరకు దగ్గరగా ఉన్నాయి. .

రెండవ క్లిప్:

ఇందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇదే వీడియో క్లిప్ కలిగి ఉన్న ఫేస్‌బుక్ పోస్ట్ ఒకటి లభించింది.

‘China Daily’ న్యూస్ పేపర్ వారు ఈ వీడియోను ‘Enjoy a bit of luxury with a hot spring bath near a waterfall at Luoji Mountain in Liangshan county. #hotspring’ అని చెప్తూ ఏప్రిల్ 2019లో అప్లోడ్ చేసారు

మూడవ క్లిప్:

ఈ క్లిప్ నుండి కొన్ని కి ఫ్రేమ్స్ వాడి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ‘People’s Daily China’ వారు ట్విట్టర్లో అప్లోడ్ చేసిన ఒక వీడియో లభించింది.

ఇదీ, వైరల్ వీడియోలో ఉన్న క్లిప్ ఒకటే. ‘Meet Asia’s largest man-made waterfall!Situated in Kunming Waterfall Park in Kunming, capital of southwest China’s Yunnan Province, it is 12.5 meters in height and 400 meters in width.’ అనేది ఈ వీడియో యొక్క పోస్ట్ వివరణ.

 నాలుగవ క్లిప్:

ఈ క్లిప్పులో ఒక జంతువు తలలోనుండి నీరు వస్తున్నట్లు ఉన్న విజువల్స్ ఉన్నాయి. ఈ క్లిప్పు యొక్క కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ‘People’s Daily China’ వారు అప్లోడ్ చేసిన ఫేస్‌బుక్  వీడియో ఒకటి దొరికింది.

ఈ ప్రదేశం పేరు డ్రాగన్ వాటర్ ఫాల్, ఇది చైనాలోని లాంగ్లీ కౌంటీలో ఉంది. వీడియోలో ఉన్న క్లిప్ రాత్రివేళ తీసినది అయినా కూడా, రెండిటిలో ఉన్న డ్రాగన్ తల మరియు ఆ కొండ ప్రదేశాన్ని బట్టి ఈ దృశ్యాలు డ్రాగన్ వాటర్ ఫాల్ యొక్క దృశ్యాలే అని నిర్ధారించుకోవచ్చు.

ఇలా, మిగిలిన వీడియో క్లిప్పులు కూడా చైనాకు చెందిన అనేక పర్యాటక ప్రదేశాలవి, వీటిలో ఏవీ కూడా టిబెట్లో ఉన్న కైలాస మానససరోవరానికి చెందినవి కావు.

చివరిగా, చైనాలోని పర్యాటక ప్రాంతాల యొక్క దృశ్యాలను ఈ పోస్టు ద్వారా కైలాస మానససరోవరంకు చెందిన దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll