Fake News, Telugu
 

ధర్మం చేయకుంటే కేసీఆర్‌కు వోటెస్తానని బిచ్చగాడు మెడలో ప్లకార్డు వేసుకున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది

0

నాకు మర్యాదగా ధర్మం చేయండి లేదంటే ఈ సారి కూడా KCRకు వోటెస్తా తరువాత మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చొని అడుక్కోవాలి”, అని ఒక వ్యక్తి మెడలో ప్లకార్డు వేసుకొని ప్రజలను బెదిరిస్తున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ధర్మం చేయకుంటే ఈ సారి కూడా కేసీఆర్‌కు వోటెస్తానని ఒక వ్యక్తి ప్లకార్డ్ మెడలో వేసుకొన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలోని ప్లకార్డుపై “నాకు మర్యాదగా ధర్మం చేయండి లేదంటే ఈ సారి కూడా జగన్‌కు వోటెస్తా తరువాత మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చొని అడుక్కోవాలి” అని రాసి ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ ఫోటోలోని వ్యక్తికి  సంబంధించిన వీడియోని ‘Mahaa News’ వార్తా సంస్థ ఇటీవల పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి మెడలో వేసుకున్న ప్లకార్డుపై, “నాకు మర్యాదగా ధర్మం చేయండి లేదంటే ఈ సారి కూడా జగన్‌కు వోటెస్తా తరువాత మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చొని అడుక్కోవాలి”, అని రాసి ఉంది.

అసలైన ప్లకార్డు ఫోటోని షేర్ చేస్తూ పలు యూసర్లు తమ సోషల్ మీడియా పేజీలలో పోస్టులు పెట్టారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని, అసలు ఫోటోలోని ప్లకార్డుపై తనకు ధర్మం చేయకుంటే YSRCP అధినేత వై. ఎస్. జగన్‌కు మళ్ళీ వోటెస్తానని ఆ వ్యక్తి ఎద్దేవా చేసినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ధర్మం చేయకుంటే కేసీఆర్‌కు వోటెస్తానని బిచ్చగాడు మెడలో ప్లకార్డు వేసుకున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll