Fake News, Telugu
 

శ్రీ కృష్ణుడు చరిత్రని నిర్ధారిస్తూ నాసా ఎటువంటి ప్రకటన చేయలేదు

0

హిందూ పురాణాలలో శ్రీ కృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించాడని తెలిపిన చరిత్ర వాస్తవమే అని నాసా నిర్ధారించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం స్క్రీన్ షాట్ షేర్ అవుతుంది. అంతేకాదు, శ్రీ కృష్ణుడు క్రీ.పూ. 3012లో మరణించినట్టు నాసా తమ విశ్లేషణలో కనుగొన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీ కృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించిన చరిత్ర వాస్తవమే అని నాసా నిర్ధారించింది.

ఫాక్ట్ (నిజం): శ్రీ కృష్ణుడి ద్వారకా నగరాన్ని పరిపాలించిన విషయం వాస్తవమే అని తెలుపుతూ నాసా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ అరేబియన్ సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారకా నగరాన్ని నిర్ధారిస్తు కొన్ని శిలా నిర్మాణాల చిత్రాలని తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. కాని, ద్వారకా నగరాన్ని, శ్రీ కృష్ణుడి ఉనికిని నాసా ఎప్పుడు నిర్ధారించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం చివరిలో, ఈ కథనాన్ని ఈటీవీ ప్రత్యేక సమాచార విభాగం ప్రచురించిందని తెలిపారు.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం కోసం ఈనాడు వెబ్సైటులో వెతికితే, మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇదే విషయాన్ని ఏ ఇతర వార్తా సంస్థా రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

ద్వారకా నగరానికి సంబంధించి నాసా ఏదైనా ప్రకటన చేసి ఉంటుందా అని వారి వెబ్సైటులో వెతికితే, ద్వారక నగరం రహస్యాలను బయటపెడుతూ నాసా ఎటువంటి సమాచారం విడుదల చేయలేదని తెలిసింది. ‘ది ఇండియన్ నేషనల్ సాటిలైట్’ (INSAT) విశిష్టతను వివరిస్తూ నాసా పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో, ఇన్సాట్ రూపకల్పనలో అలాగే, భారత స్పేస్ టెక్నాలజీ అభ్యున్నతిలో ముఖ్యపాత్ర పోషించిన విక్రమ్ సారాభాయ్‌ని శ్రీ కృష్ణుడితో పోల్చింది. కాని, శ్రీ కృష్ణుడి గురించి హిందూ పురాణాలలో తెలిపిన సమాచారం వాస్తవమని నాసా ఎప్పుడు నిర్ధారించలేదు. ఉత్తర భారత దేశంలో దాగి ఉన్న రహస్యాల గురించి, రామ సేతు నిర్మాణం గురించి నాసా పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ అరేబియన్ సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారకా నగరాన్ని నిర్ధారిస్తు కొన్ని శిలా నిర్మాణాల చిత్రాలని తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ పబ్లిష్ చేసిన ఈ చిత్రాలని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. శ్రీ కృష్ణుడి జనన మరణానికి సంబంధించిన సమాచారాన్ని పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ ఆర్టికల్స్‌లో తెలిపిన సమాచారం ప్రకారం, శ్రీ కృష్ణుడు క్రీ.పూ. 3112లో జన్మించి, 125 సంవత్సరాల వయసులో మరణించారని తెలిపారు.

చివరగా, శ్రీ కృష్ణుడు చరిత్రని, ద్వారకా నగరాన్ని నిర్ధారిస్తు నాసా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll