Fake News, Telugu
 

‘అరెస్ట్ భయంతో నారా లోకేష్ పరారీలో ఉన్నాడు’ అన్న ప్రకటన TV9 చేయలేదు

0

టీడీపీ నాయకుడు నారా లోకేష్ అరెస్టు భయంతో పరారీలో ఉన్నారని, వారం రోజుల నుండి కనపడటంలేదని TV9 ప్రకటన ఇచ్చినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో ఎంత నిజముందో ఈ కధనం ద్వారా చూద్దాం.

క్లెయిమ్: నారా లోకేష్ అరెస్ట్ భయంతో వారం రోజుల నుండి పరారీలో ఉన్నాడు.

ఫాక్ట్ (నిజం): ఈ ప్రకటనకు, TV9 ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదని, ఇది TV9 పేరుతో కొందరు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని TV9 ట్విట్టర్ ద్వారా తెలిపింది. కావున, ఈ వీడియోలో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వార్త గురించి ఇంటర్నెట్లో వెతికితే దీనికి సంబంధించిన వార్తలు TV9 ఛానెళ్ళోనే కాకుండా ఏ వార్తా పత్రిక లేదా న్యూస్ ఛానెల్ ప్రచురించినట్లు కనపడలేదు. పైగా, దీని గురించి TV9 ట్విట్టర్ పోస్టు ద్వారా ఈ ప్రకటన తాను చేయలేదని, ఇది TV9 పేరుతో కొందరు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని తెలిపింది.

నారా లోకేష్, చంద్రబాబు నాయుడు విడుదల కోసం వివిధ పార్టీల నేతలతో సమావేశమై మద్దతు కోరేందుకు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఈ వార్త వైరల్ అవుతుంది. ట్విట్టర్లో పోస్టుల ద్వారా లోకేష్  దీనికి సంబంధించిన విషయాలను తెలపడం గమనించాం.

చివరిగా, ‘అరెస్ట్ భయంతో నారా లోకేష్ పరారీలో ఉన్నాడు’ అన్న ప్రకటన TV9 చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll