Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆల్కలైన్ ఆహార పదార్థాలు కరోనావైరస్ ని చంపగలవు అనేది ఫేక్ మెసేజ్

0

జర్నల్ ఆఫ్ వైరాలజీ & యాంటివైరల్ రీసెర్చ్ ప్రకారం pH 8.5 కంటే ఎక్కువ ఉన్న ఆల్కలైన్ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కరోనావైరస్ చనిపోతుందనే మెసేజ్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ మెసేజ్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో  విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: pH 8.5 కంటే ఎక్కువ ఉన్న ఆల్కలైన్ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కరోనావైరస్ చనిపోతుంది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్‌లో చెప్పిన జర్నల్ ఆఫ్ వైరాలజీ & యాంటివైరల్ రీసెర్చ్ పేపర్ లో పేర్కొంది ‘మౌస్ హెపటైటిస్ వైరస్ టైప్ 4 (MHV4)’ గురించి, SARS-CoV-2 వైరస్ గురించి కాదు. పోస్ట్ లో కొన్ని ఆహార పదార్థాలకు తప్పు pH ఇచ్చారు. అంతేకాక, ఆల్కలైన్ ఆహార పదార్థాలు తింటే కరోనా వైరస్ చనిపోతుందని నిరూపించడానికి ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్ట్‌లో చెప్పిన జర్నల్ ఆఫ్ వైరాలజీ & యాంటివైరల్ రీసెర్చ్ పేపర్ ని ఇక్కడ చూడవచ్చు. అందులో పేర్కొంది ‘మౌస్ హెపటైటిస్ వైరస్ టైప్ 4 (MHV4)’ గురించి, SARS-CoV-2 వైరస్ (కోవిడ్-19) గురించి కాదు (ఇది 2019లోనే  మొదట రిపోర్ట్ చేయబడింది).

pH స్కేల్  రేంజ్ 0-14 మధ్య లో ఉంటుంది. కానీ, పోస్ట్ లోని కొన్ని ఆహార పదార్థాల pH 14 కంటే ఎక్కువగా ఉంది. అంతేకాక, నిమ్మకాయ యొక్క pH 9.9 కాదు, దాని pH 2 కి దగ్గర ఉంటుంది.

WHO కానీ భారత ప్రభుత్వం కానీ  కరోనావైరస్ ని చంపే ఆల్కలైన్ పదార్థాలతో కూడిన ఏ డైట్ ని సూచించలేదు. ‘Africa Check’ వారు రాసిన కథనం లో ఓయేవాలే తోమోరి (WHO కి సంబంధించిన ఒక వైరాలజీ ప్రొఫెసర్) కరోనావైరస్ కడుపుకి సంబంధించిన వైరస్ కాదని,  నిమ్మకాయ, అవొకాడో, వెల్లుల్లి వంటి ఆల్కలైన్ ఆహార పదార్థాలు వైరస్ ని చంపలేవని, కావున ఆ క్లెయిమ్ ని పట్టించుకోవద్దని చెప్పడాన్ని చూడవచ్చు.

చివరగా, ఆల్కలైన్ ఆహార పదార్థాలు కరోనావైరస్ ని చంపగలవు అనేది ఫేక్ మెసేజ్.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll