హనుమాన్ జయంతి ర్యాలీ వీడియో అని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. రెండేళ్ళ కింద పోస్ట్ చేసిన ఆ వీడియోని ఇప్పటికీ షేర్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 41 వేల మందికి పైగా ఆ పోస్ట్ ని షేర్ చేసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: హనుమాన్ జయంతి ర్యాలీ వీడియో.
ఫాక్ట్ (నిజం): అది హనుమాన్ జయంతి ర్యాలీ వీడియో కాదు, మరాఠా రిజర్వేషన్ కోసం ముంబై లో మరాఠీలు చేసిన ‘Maratha Kranti Morcha’ ర్యాలీ కి సంబంధించిన వీడియో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోతో ఉన్న యూట్యూబ్ వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. యూట్యూబ్ లో ఆ వీడియో టైటిల్ ‘Maratha andolan–JJ Flyover 4.5-5 LAKHS OF PROTESTERS MARCH TO AZAD MAIDAN,AT MUMBAI’ అని ఉంటుంది. కావున పోస్ట్ లోని వీడియో 2017 లో మరాఠా రిజర్వేషన్ కోసం ముంబై లో నిర్వహించిన ‘Maratha Kranti Morcha’ ర్యాలీ కి సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. ఆ ఫ్లైఓవర్ పై వెళ్తున్న ర్యాలీ యొక్క ఫోటో మరియు వీడియోలను వివిధ వార్తాసంస్థలు కూడా ప్రచురించినట్టు చూడవొచ్చు.
చివరగా, మరాఠా రిజర్వేషన్ కోసం చేసిన ర్యాలీ వీడియో పెట్టి హనుమాన్ జయంతి ర్యాలీ వీడియో అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: మరాఠా రిజర్వేషన్ కోసం చేసిన ర్యాలీ వీడియో పెట్టి హనుమాన్ జయంతి ర్యాలీ అని తప్పుగా ప్రచారం చేస