Fake News, Telugu
 

చేపలు రోడ్డు దాటుతున్న ఈ వీడియో వాషింగ్టన్ కి (అమెరికా) సంబంధించింది, గండిపేటది కాదు.

0

గండిపేట చెరువు సమీపంలో రోడ్డు ఎదురు ఎక్కుతున్న చేపలు అని చెప్తూ, చేపలు రోడ్డు దాటే వీడియో షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గండిపేట చెరువు సమీపంలో రోడ్డు ఎదురు ఎక్కుతున్న చేపల వీడియో.

ఫాక్ట్(నిజం): చేపలు రోడ్డు దాటుతున్న వీడియో అమెరికా లోని వాషింగ్టన్ లో చిత్రీకరించిందని ‘The Weather News’ అనే అమెరికాకి చెందిన వాతావరణ న్యూస్ ఛానల్  2016లో తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. దీన్నిబట్టి ఈ వీడియోకి గండిపేట చెరువుకి, హైదేరాబద్ వర్షాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

“fishes crossing road”  అనే కీవర్డ్స్ తో యూట్యూబ్ లో సెర్చ్ చేయగా అచ్చం పోస్టులో ఉన్న వీడియోని లాంటిదే ఒక వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో ‘The Weather Channel’ అనే అమెరికా కి చెందిన వాతావరణ న్యూస్ ఛానల్ లో 06 డిసెంబర్ 2016న అప్లోడ్ చేయబడి ఉంది. ఈ వీడియోకి సంబంధించిన వివరణ ప్రకారం ఈ వీడియో 06 నవంబర్ 2016న షెల్టన్, వాషింగ్టన్ లో చిత్రీకరించింది. దీన్నిబట్టి ఈ వీడియో గండిపేటకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. 

ప్రతి నవంబర్, డిసెంబర్ లో సాల్మన్ చేపలు వాషింగ్టన్ లోని స్కొకొమిష్ అనే చెరువు సమీపంలోని రోడ్డు దాటుతూ కనిపిస్తాయని చెప్పే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రచారం చేసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

పోస్టులో ఉన్న వీడియో లాంటి వీడియో మరొక యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడొచ్చు, ఈ వీడియో వివరణలో కూడా ఈ వీడియో అమెరికా లోని వాషింగ్టన్ కి సంబంధించిందని ఉంది. పోస్టులో ఉన్న వీడియో లాంటివే మరికొన్ని వీడియోస్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియో కి హైదరాబాద్ వర్షాలకు ఇంకా గండిపేట చెరువుకు ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు.

ఇటీవల హైదరాబాద్ లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధంలేని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైదరాబాద్ వర్షాలకు సంబంధించినవి అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, అమెరికా లోని వాషింగ్టన్ లో చేపలు రోడ్ దాటుతున్న వీడియోని, హైదరాబాద్ వర్షాలకు, గండిపేట సమీపంలో రోడ్ దాటుతున్న చేపలు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll