Fake News, Telugu
 

ఈ వీడియోలో కేసీఆర్ పేర్కొన్నది అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్ గురించి, విస్కీ బ్రాండ్ జెఫెర్సన్ గురించి కాదు

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘అమెరికా రాజ్యాంగం రాసిన జెఫెర్సన్’ అని పేర్కొన్న వీడియో క్లిప్ ని చూపిస్తూ అసలు జెఫెర్సన్‌ అనే వ్యక్తికీ అమెరికా రాజ్యాంగానికి ఎటువంటి సంబంధం లేదని, జెఫెర్సన్‌ అనేది ఒక విస్కీ బ్రాండ్ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: జెఫెర్సన్‌ అనే వ్యక్తికీ, అమెరికా రాజ్యాంగంకి ఎటువంటి సంబంధం లేదు; అసలు జెఫెర్సన్‌ అనేది విస్కీ బ్రాండ్ యొక్క పేరు.

ఫాక్ట్: థామస్ జెఫెర్సన్ అమెరికా దేశ మూడవ అధ్యక్షుడు, ఆయనకు ఆ దేశ రాజ్యాంగానికి చారిత్రక  సంబంధం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నది ఆయన గురించే. కావున, పోస్ట్ లో చెప్తున్నది తప్పుదోవ పట్టిస్తున్నది.

వీడియోలో ఉన్న లోగో ఆధారంగా ‘Top Telugu TV’ అనే యూట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియో కోసం వెతకగా, జులై 20వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్తీక ఇంటర్వ్యూ ప్రోమోని అప్లోడ్ చేసిన  వీడియో దొరికింది.  పూర్తి ఇంటర్వ్యూ 21వ తేదీన అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో కార్తీక తన మొబైల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘అమెరికా రాజ్యాంగం రాసిన జెఫెర్సన్’ అని అన్న క్లిప్ ని చూపించి, జెఫెర్సన్ అనేది ఒక విస్కీ, అమెరికా రాజ్యాంగ రాసింది జేమ్స్ మ్యాడిసన్, గూగుల్ చేస్తే తెలుస్తుంది అని అన్నట్టు చూడవొచ్చు.

ఇంటర్నెట్ లో సరైన కీ వర్డ్స్ తో వెతకగా కేసీఆర్ జెఫెర్సన్ గురించి మాట్లాడిన ప్రెస్ మీట్ లింక్ దొరికింది. అందులో ఆయన అమెరికా రాజ్యాంగం రాసింది జెఫెర్సన్ అని, జెఫెర్సన్ చెప్పినట్లుగా ఒక కోట్ చెప్పారు. దీని గురుంచి వెతకగా, అమెరికా రాజ్యాంగ పితామహుడు జేమ్స్ మ్యాడిసన్ అని తెలిసింది. అయితే, జెఫర్సన్స్ అనే విస్కీ బ్రాండ్ కూడా ఉన్నట్టు తెలిసింది. జెఫెర్సన్ అనే పేరు గల వ్యక్తికీ అమెరికాకు ఉన్న సంబంధం గురించి వెతుకగా, థామస్ జెఫెర్సన్ అమెరికా ఒక్క మూడవ అధ్యక్షుడు అని తెలుస్తుంది. అమెరికా యొక్క డిక్లరేషన్ ఆఫ్  ఇండిపెండెన్స్ రచించింది అతనే. ఆయన అమెరికా యొక్క ఫాదర్ అఫ్ కాన్స్టిట్యూషన్ జేమ్స్ మెడిసిన్ ఒక్క మెంటర్ (గురువు).

థామస్ జెఫెర్సన్ ప్రత్యక్షంగా రాజ్యాంగాన్ని రాయకపోయినప్పటికీ, ఆయన ప్రభావం అమెరికా రాజ్యాంగ రచనలో ఉన్నట్టు తెలుపుతున్న ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చదవచ్చు. 

కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జెఫెర్సన్ ‘every generation is a nation, it has every right to rewrite the constitution of its country suitably, అని అన్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ లో దాని గురించి వెతకగా ఆయన ఆ విధంగా నిజంగా అన్నట్లు పలు కథనాలు లభించాయి. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

 జెఫెర్సన్ అనేది విస్కీ బ్రాండ్ యొక్క పేరు మాత్రమే కాదు, థామస్ జెఫెర్సన్ అమెరికా మూడవ అధ్యాక్షుడు. ఆయనకు ఆ దేశ రాజ్యాంగానికి సంబంధం కూడా ఉంది. అందుచేత, వీడియో లో చెప్తున్నది తప్పుదోవ పట్టిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll