Fake News, Telugu
 

కర్ణాటక BMTC బస్సు కండక్టర్ మధు UPSC మెయిన్స్ పరీక్ష క్లియర్ చేయలేదు

0

రోజుకు ఐదు గంటలు చదువుకొని UPSC మెయిన్స్ పరీక్షను క్లియర్ చేసిన బస్సు కండక్టర్ మధు కథ, అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) లో కండక్టర్ గా పనిచేసిన మధు, తన సంస్థ ఎండి శిఖా గారిని స్పూర్తిగా తీసుకొని UPSC పరీక్షకు చదివినట్టు ఈ పోస్టు లో తెలిపారు. అంతేకాదు, మధు తన స్టడీ మెటీరియల్స్ ని తానే సొంతంగా తయరుచేసుకున్నాడని, తన సంస్థలో పనిచేస్తున్న సినియర్ల సలహాలు తీసుకొని ఈ ఘనత సాధించినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూడ్డం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రోజుకు ఐదు గంటలు చదువుకొని UPSC మెయిన్స్ పరీక్షను క్లియర్  చేసిన బస్సు కండక్టర్ మధు కథ.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చెబుతున్న విషయాలని రిపోర్ట్ చేస్తూ ‘Bangalore Mirror’ న్యూస్ వెబ్ సైట్ 2020లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అయితే, కండక్టర్ మధు తమకు అబద్దం చెపినట్టు ‘Bangalore Mirror’ వెబ్ సైట్ ఎడిటర్ తరువాత స్పష్టం చేసారు. 2019 యుపిఎస్సి మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసిన వ్యక్తుల జాబితాలో మధు NC అనే పేరు ఎక్కడా కనిపించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెబుతున్న వ్యక్తి కి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతికితే, మధు NC అనే బస్సు కండక్టర్ UPSC పరిక్ష క్లియర్ చేసిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘Bangalore Mirror’ న్యూస్ వెబ్ సైట్ 28 జనవరి 2020 నాడు ఒక వీడియో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) లో బస్సు కండక్టర్ గా పనిచేస్తున్న మధు NC, UPSC మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసినట్టు ఈ వీడియోలో తెలిపారు.

 ‘Bangalore Mirror’ న్యూస్ వెబ్ సైట్ కండక్టర్ మధు గురించి పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఆ న్యూస్ సంస్థ ఎడిటర్ రవి జోషి తన ట్విట్టర్ పేజిలో షేర్ చేసారు. 28 జనవరి 2020 నాడు ఆయన ఈ ట్వీట్ పోస్ట్ చేసారు.  

అయితే, BMTC కండక్టర్ మధు గురించి తాము పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో నిజాలు లేవని ఎడిటర్ రవి జోషి 30 జనవరి 2020 నాడు మరొక ట్వీట్ పెట్టారు. UPSC మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసానని కండక్టర్ మధు తమకు అబద్దం చెపినట్టు తన ట్వీట్ లో తెలిపారు. తాము పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని తీసేస్తున్నట్టు రవి జోషి తన ట్వీట్ లో తెలిపారు. ఈ వివరాలని తెలుపుతూ ‘Newslaundry’ సంస్థ కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 2019 UPSC మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసిన మధు కుమారి రోల్ నెంబర్ ని కండక్టర్ మధు ‘Bangalore Mirror’ సంస్థకి ఇచ్చినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

2019 యుపిఎస్సి మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసిన వ్యక్తుల జాబితాలో మధు NC అనే పేరు ఎక్కడా కనిపించలేదు. మధు కుమారి అనే అమ్మయి ఈ పరీక్ష క్లియర్ చేసిన వ్యక్తుల జాబితాలో ఉంది.  కండక్టర్ మధు గురించి ‘Bangalore Mirror’ న్యూస్ వెబ్ సైట్ మొదట పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఆధారంగా ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతుందని చెప్పవచ్చు.

చివరిగా, కర్ణాటక BMTC బస్సు కండక్టర్ మధు యుపిఎస్సి మెయిన్స్ పరీక్ష క్లియర్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll