Fake News, Telugu
 

2017 వీడియోని ఇప్పుడు ఫ్రాన్స్ లో ముస్లింల ప్రార్ధనలకు వ్యతిరేకంగా నిరసనలంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల అక్టోబర్ 2020లో ఫ్రాన్స్ లో ముస్లింలు నమాజ్ చేస్తుంటే వారికి వ్యతిరేకంగా అక్కడి క్రిస్టియన్లు ప్రేయర్ మొదలుపెట్టారని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అక్టోబర్ 2020లో ఫ్రాన్స్ లో ముస్లింలు నమాజ్ చేస్తుంటే వారికి వ్యతిరేకంగా అక్కడి క్రిస్టియన్లు ప్రేయర్ మొదలుపెట్టారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2017లో ఫ్రాన్స్ లోని క్లిచిలో తమ ప్రార్ధన హాల్ ను మూసివేయడాన్ని నిరసిస్తూ కొందరు ముస్లింలు రోడ్డు పైన ప్రార్ధన చేస్తుండగా, వీరికి వ్యతిరేకంగా మేయర్ రెమి ముజేయు నేతృత్వంలో కొందరు నిరసనకారులు ఫ్రెంచ్ జాతీయ గీతం పాడుకుంటూ ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ రెండు వర్గాలు ఎదురుపడ్డ ఘటనకి సంబంధించింది, అంతేకాని ఇటీవల జరిగిన సంఘటన కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న వీడియో గురించిన మరింత సమాచారం కోసం యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటన రిపోర్ట్ చేసిన కొన్ని 2017 న్యూస్ వీడియోలు మాకు కనిపించాయి. ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ వీడియో ఫ్రాన్స్ లోని క్లిచిలో తమ ప్రార్ధన హాల్ ను మూసివేయడాన్ని నిరసిస్తూ కొందరు ముస్లింలు రోడ్డుపైన ప్రార్ధన చేస్తుండగా, వీరికి వ్యతిరేకంగా మేయర్ రెమి ముజేయు నేతృత్వంలో కొందరు నిరసనకారులు ఫ్రెంచ్ జాతీయ గీతం పాడుకుంటూ ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ రెండు వర్గాలు ఎదురుపడ్డ ఘటనకి సంబంధించింది. ఇదే విషయం చేప్తున్న మరొక న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

యూట్యూబ్ వీడియో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించిన కొన్ని 2017 వార్తా కథనాలు మాకు దొరికాయి. ఈ కథనాలు కూడా పైన చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తున్నాయి, ఈ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని ఫొటోలు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిబట్టి ఈ వీడియో 2017లో ఫ్రాన్స్ లో జరిగిన ఘటనకి సంబంధించిందని, ఇటీవల కాలంలో జరిగిన సంఘటన కాదని కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల మొహమ్మద్ ప్రవక్త కార్టూన్లు క్లాస్ లో ప్రదర్శించిన కారణంగా శామ్యూల్ ప్యాటీ అనే టీచర్ తల ఒక 18 ఏళ్ల ముస్లిం యువకుడు నరికివేశాడు. అలాగే, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై  చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రాన్స్ తో సహా పలు దేశాలలో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల సందర్భంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, 2017లో ఫ్రాన్స్ లో జరిగిన ఘటన వీడియోని, అక్టోబర్ 2020లో ఫ్రాన్స్ లో ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటే వారికి వ్యతిరేకంగా అక్కడి క్రిస్టియన్లు ప్రేయర్ మొదలుపెట్టారు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll