Fake News, Telugu
 

ఈ ఫోటో తమిళనాడు లో బీజేపీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు సంబంధించింది కాదు.

0

తమిళనాడు లో బీజేపీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు వచ్చిన జనసందోహం అని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడు లో బీజేపీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు వచ్చిన జనసందోహం ఫోటో.

ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో పాతది. ఆ ఫోటోకీ, తమిళనాడు లో బీజేపీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు ఎటువంటి సంబంధంలేదు. అది 2018 లో సుప్రీం కోర్టు శబరిమల పై ఇచ్చిన తీర్పుకు నిరసనగా కేరళలో నిర్వహించిన ర్యాలీ ఫోటో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి ఫోటోలనే పలు వార్తాసంస్థలు (‘ది హిందూ’, ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్’, ‘ది వీక్’) 2018 లోనే ప్రచురించినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలు 2018 లో సుప్రీం కోర్టు శబరిమల పై ఇచ్చిన తీర్పుకు నిరసనగా కేరళలో నిర్వహించిన ర్యాలీ కి సంబంధించినవి. వార్తాసంస్థలు ప్రచురించిన ఫోటోల్లోని మనుషులు మరియు ప్రదేశం, పోస్ట్ లోని ఫోటోలో కూడా ఉన్నట్టు చూడొచ్చు.

కేరళ లో జరిగిన ఆ ర్యాలీ కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఫోటోలో ఉన్న వీధి యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూ ని ఇక్కడ చూడవొచ్చు.

తమిళనాడు లో బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు సంబంధించిన వివరాలను మరియు ఫోటోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని ఫోటో తమిళనాడు లో బీజేపీ నిర్వహిస్తున్న వెట్రివేల్‌ యాత్రకు సంబంధించింది కాదు. 2018 లో సుప్రీం కోర్టు శబరిమల పై ఇచ్చిన తీర్పుకు నిరసనగా కేరళలో నిర్వహించిన ర్యాలీ ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll