Fake News, Telugu
 

వీడియోలోని వ్యక్తి యోగీ కాదు, 300 సంవత్సరాల క్రితం తమిళనాడు లో జీవ సమాధీ కాలేదు

0

తమిళనాడు లోని వల్లియూర్లో 300 సంవత్సరాల క్రితం జీవ సమాధి అయిన ఒక యోగి ఇంకా సజీవంగానే ఉన్నాడని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్ బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తమిళనాడు లోని వల్లియూర్లో 300 సంవత్సరాల క్రితం జీవ సమాధికి వెళ్లి ఇప్పుడు సజీవంగా దొరికిన ఒక యోగి. 

ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలోని వ్యక్తి యోగి కాదు. అతడు 300 సంవత్సరాల క్రితం తమిళనాడు లో జీవ సమాధి కూడా కాలేదు. తన పేరు అలెగ్జాండర్, కజకిస్థాన్ కి చెందినవాడు. అతను ‘సోరియాసిస్’ వ్యాధి తో బాధపడుతున్నాడు. కావున, ఆ పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.    

ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని ‘Yandex’ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే, ఆ విజువల్స్ తో ఉన్న చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించాయి. ‘Daily Mail’ వారు రాసిన ఆర్టికల్ ప్రకారం ఆ వీడియోలో ఉన్న అతని పేరు అలెగ్జాండర్ పి అని, ఆయన కజకిస్థాన్ లోని అక్టోబె నగరం లో ఉంటాడని  తెలిసింది.  అదే ఆర్టికల్ లో, ఇంతకముందు అదే వీడియో ఎలుగుబంటి చేత దాడి కాబడ్డ ఒక వ్యక్తి వీడియో అని వైరల్ అయ్యింది అని ఉంది.  కానీ, తరువాత  ఆ వీడియోలోని వ్యక్తి ఎలుగుబంటి చేత దాడికి గురి కాలేదని, అతను ‘సోరియాసిస్’ అనే వ్యాధి తో భాదపడుతున్నాడు అని తెలిసింది అని ఉంది.

ఆ వీడియో లోని వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్ ‘Daily Mail’ తో మాట్లాడుతూ అతనికి వైద్య పరీక్షలు చేసేటప్పుడు, ఎవరో అతని వీడియోని లీక్ చేసి యూట్యూబ్ లో పెట్టారని తెలిపాడు. ఆ వీడియోలోని వ్యక్తి ‘సోరియాసిస్’ వ్యాధి తో బాధపడుతున్నాడు అని, అతను చికిత్స తీసుకోకపోవడం వళ్ళ ఆ వ్యాధి ఎక్కువ అయ్యింది అని తెలిపాడు. ఇతర మీడియా సంస్థల రిపోర్ట్ ప్రకారం, సోరియాసిస్ గాయాల వళ్ళ వచ్చిన ఇన్ఫెక్షన్ తరువాత ఆ వ్యక్తి సెప్సిస్ వలన చనిపోయాడు అని తెలిసింది. ఆ వీడియోలోని వ్యక్తి గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

చివరగా, ఆ వీడియోలోని వ్యక్తి ఒక యోగీ కాదు, 300 సంవత్సరాల క్రితం తమిళనాడు లో జీవ సమాధీ కాలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll