Fake News, Telugu
 

CTET పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం, ఇతర నగలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు

0

విజయవాడ లోని మారిస్ స్టెల్లా కాలేజీ లో సీటెట్‌ (సెంట్రల్ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష రాయటానికి వచ్చిన మహిళలను గాజులు, తాళిబొట్లు తీయించిన ‘క్రైస్తవ విద్యా సంస్థ’ పరీక్షా సిబ్బంది అని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ‘మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినది కాబట్టి దీని వెనుక మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉన్నదని ప్రజల ఊహాగానాలు’, అని కూడా పోస్ట్ లో రాసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: CTET పరీక్ష రాయటానికి వచ్చిన మహిళలను గాజులు, తాళిబొట్లు తీయించిన ఆంధ్రప్రదేశ్ లోని ‘క్రైస్తవ విద్యా సంస్థ’ పరీక్షా సిబ్బంది.

ఫాక్ట్: CTET పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారు నిర్వహిస్తారు. సీటెట్‌ పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం, ఇంకా ఎటువంటి నగలు పరీక్ష కేంద్రంలోకి తీసుకుపోవడానికి లేదు. కాబట్టి, మహిళల గాజులు, తాళిబొట్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతించొద్దు అని విద్యా సంస్థ సిబ్బంది లేక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. పోస్ట్ లో విద్యా సంస్థ సిబ్బందిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

మారిస్ స్టెల్లా కాలేజీ ఫోటోలను పోస్ట్ లోని ఫోటోలతో పోల్చి చూడగా, ఆ ఫోటోలను మారిస్ స్టెల్లా కాలేజీ ముందే తీసినట్టు తెలుస్తుంది.

అయితే, CTET‌ పరీక్షను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారు నిర్వహిస్తారు. సీటెట్‌ పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం, ఇంకా ఎటువంటి నగలు పరీక్ష కేంద్రంలోకి తీసుకుపోవడానికి లేదని చూడవొచ్చు. కాబట్టి, మహిళల గాజులు, తాళిబొట్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతించొద్దు అని విద్యా సంస్థ సిబ్బంది లేక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు.

చివరగా, సీటెట్‌ పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం మరియు ఇతర నగలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

Share.

About Author

Comments are closed.

scroll