గత వారం వెస్ట్ బెంగాళ్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఒక కుటుంబంలో ముగ్గురు హత్య కాబడిన సందర్భంలో, ఆ హత్యల్లో చనిపోయిన ఆ కుటుంబ పెద్ద బంధు పాల్ RSS లో ఉన్నారు అనే కారణం వల్లనే ఆ హత్యలు జరిగాయి అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్: RSS తో సంబంధం ఉంది కాబట్టే బంధుపాల్, అతని కుటుంబం హత్య కాబడింది.
ఫాక్ట్ (నిజం): బంధుపాల్ తల్లి తన కొడుక్కి BJP పార్టీతో గాని, RSS తో గాని ఏ సంబంధం లేదని ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. BJP జిల్లా కమిటీ లీడర్ మరియు బంధుపాల్ ఇంటి చుట్టు పక్కన ఉండే మనోజ్ సర్కార్ కూడా పాల్ కి ఏ పార్టీ తో సంబంధం లేదని చెప్పాడు. వెస్ట్ బెంగాల్ పోలీస్ కూడా తాము హంతకుడి గా అనుమానిస్తున్న వ్యక్తి పాల్ తో ఉన్న ఆర్థిక తగాదాల వాళ్ళ హత్య చేసాడని, ఆ హత్యలకు రాజకీయాలకి ఏ సంబంధం లేదని తెలియచేశారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
అక్టోబర్ 8, 2019 న వెస్ట్ బెంగాల్ లో బంధు ప్రకాష్ పాల్ అనే ఒక స్కూల్ టీచర్ని, అతని భార్యని, కుమారుడిని వాళ్లింట్లోనే దారుణంగా హత్య చేసారు. అప్పటినుంచి బంధు పాల్ RSS వ్యక్తి కావడం వల్లనే ఈ హత్యలు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు.
‘Indian Express’ వాళ్ళు బంధు పాల్ వాళ్ళ తల్లిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన కొడుకు కి RSS, BJP తో గాని, TMC పార్టీ తో గాని సంబంధం లేదని తెలియజేసింది. బంధుపాల్ చుట్టాలు కూడా అతనికి పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉంది అన్న మాటని కొట్టిపారేశారు.
బంధుపాల్ ఇంటి దగ్గర ఉండే BJP జిల్లా కమిటీ లీడర్ మనోజ్ సర్కార్ కూడా పాల్ అసలు రాజకీయాల గురించే మాట్లాడకపోయేవాడు అని, అతనికి ఏ పార్టీ తో సంబంధమే లేదని చెప్పాడు.
‘Indian Express’ వారు RSS సీనియర్ నాయకుడు బిద్యుత్ రాయ్ తో మాట్లాడితే పాల్ నాలుగు నెలల నుండే తమకు తెలుసని, అతను RSS లో ఉన్నాడన్న కారణం వల్ల హత్య కాబడ్డాడు అనేది తాను నమ్మడం లేదని తెలిపాడు.
ముర్షిదాబాద్ లో జరిగిన హత్యలను కొంతమంది రాజకీయ కోణంతో ముడిపెడుతూ సోషల్ మీడియా లో షేర్ చేస్తుండడం తో వెస్ట్ బెంగాల్ పోలీస్ ట్వీట్ చేస్తూ ఆ హత్యలకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. అంతేకాక, వారు అక్టోబర్ 15న రిలీజ్ చేసిన ట్వీట్ లో ఒకతను ఆ హత్యలు తానే చేసాడని ఒప్పుకున్నాడని, పాల్ తో అతనికి ఆర్ధిక విషయాల్లో జరిగిన గొడవల వళ్ళ అతను ఆ హత్యలు చేసాడని తెలిపారు. ‘Times of India’ వారు కూడా ఇదే విషయాన్నీ తెలియచేస్తూ ప్రచురించిన ఆర్టికల్ ని చూడవచ్చు.
District Police and CID will continue the investigation to find out more evidence to prove the involvement of the arrested person in the crime including the involvement of anyone else..2/2
— West Bengal Police (@WBPolice) October 15, 2019
చివరగా, వెస్ట్ బెంగాల్, ముర్షిదాబాద్ లో జరిగిన హత్యలకు రాజకీయాలు కారణం కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
2 Comments
Pingback: వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఆ ముగ్గురి హత్యలకు రాజకీయాలు కారణం కాదు - Fact Checking Tools | Factbase.us
Police are in support of govt., It’s a place where democracy is crippling to exist. His mother will be under natural stress of loss and incapacitated to with stand further problems.
As regards Facebook enquiries Facebook nurtures high values. It’s very difficult to unearth the malafide intentions of the case for them as they make prime face enquiries.