జస్టిస్ మార్కండేయ కట్జు BJP ఒక గూండాల గుంపని, మూర్ఖుల సంస్థ అని ఇంకా పలు వ్యాఖ్యలు చేసిననట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జస్టిస్ మార్కండేయ కట్జు BJP ఒక గూండాల గుంప అని, మూర్ఖుల సంస్థ అని వ్యాఖ్యానించాడు.
ఫాక్ట్ (నిజం): 2019లో BJP పై కట్జు ఇవే వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయినప్పుడు తన పేరుమీద ఉన్న ఫేక్ ఎకౌంట్లు తను BJP పై ఇలా వ్యాఖ్యానించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
గూగుల్ సెర్చ్ ద్వారా ఇదే విషయంపై వివరణ ఇస్తూ 2019లో చేసిన ట్వీట్ మాకు కనిపించింది. 2019లో BJP పై కట్జు ఇవే వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయినప్పుడు తన పేరు మీద ఉన్న ఫేక్ ఎకౌంట్లు తను BJP పై ఇలా వ్యాఖ్యానించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు.
పైగా మార్కండేయ కట్జు BJP గురించి ఇలా నిజంగా అన్నట్టు మాకు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక వేరే ఇతర కచ్చితమైన సమాచారం గాని లభించలేదు. వీటన్నిట్టి ఆధారంగా కట్జు పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేయలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, జస్టిస్ మార్కండేయ కట్జు BJP ఒక గూండాల గుంప అని , మూర్ఖుల సంస్థ అని అనలేదు.