Fake News, Telugu
 

చైనాలో క్రైస్తవ మతాన్ని రద్దు చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవల ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు

0

చైనా ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మతాన్ని రద్దు చేసి అక్కడి చర్చిలను తగలపెడుతుంది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. భారీ మంటలలో ఒక చర్చి తగలపడిపోతున్న ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా ప్రభుత్వం చైనాలో క్రైస్తవ మతాన్ని రద్దు చేసి, అక్కడి చర్చిలను తగలపెడుతోంది.

ఫాక్ట్ (నిజం): చైనా ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మతాన్ని రద్దు చేస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనా జాతీయ భద్రతను పెంచేందుకు మతపరమైన వ్యవహారాలపై మరిన్ని ఆంక్షలు విధించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల ఆదేశించారు. కానీ, చైనాలోని చర్చిలపై ఇటీవల దాడులు జరిపి తగలపెట్టినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం చైనా ప్రభుత్వ వెబ్సైటులో వెతికితే, చైనాలో క్రైస్తవ మతాన్ని పూర్తిగా రద్దు చేస్తు చైనా ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిసింది. ఒక వేళ చైనా ప్రభుత్వం నిజంగా అలాంటి ప్రకటన చేసి వుంటే, అన్ని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు. చైనా నేషనల్ మైనారిటీ పాలసీ గురించిన పూర్తి వివరాలని ఇక్కడ చూడవచ్చు. చైనా నేషనల్ పాలసీలో క్రైస్తవ మతాన్ని ఒక మైనారిటీ మతంగా గుర్తించిన విషయాన్నీ మనం చూడవచ్చు.

అయితే, బీజింగ్ నగరంలో ఇటీవల మతవ్యవహరాలపై జరిగిన రెండు రోజుల నేషనల్ కాన్ఫరెన్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, చైనాలో మతవ్యవహరాలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెంచాలని ఆదేశించారు. చైనా జాతీయ భద్రతను పెంచేందుకు మతపరమైన వ్యవహారాలపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సదస్సులో పిలుపునిచ్చారు. చైనాలో ఆచరిస్తున్న అన్ని మతాలు నాస్తిక సైద్ధాంతానని నమ్మే ‘కమ్యూనిస్ట్ పార్టి ఆఫ్ చైనా’ (CPC) మార్గదర్శకంలో నడవాలని, సోషలిస్ట్ భావజాలాన్ని పెంపొందించే విధంగా మత భోధనలు చైనికరించాలని చైనా ప్రభుత్వం అక్కడ ‘సినిసైజేషన్’ అనే ఒక రూల్ ఆఫ్ లా పాలసీని అమలు చేస్తుంది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చైనా ప్రభుత్వం ఇటీవల క్రిస్టియన్ యాప్‌లు, పాటలు, అధికార పార్టీ చరిత్రను విమర్శించే విధంగా పెట్టిన మిలియన్ల కొద్దీ సోషల్ మీడియా పోస్టులను తొలగించినట్టు ‘Asia News’ వెబ్సైటు 05 డిసెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. చైనాలోని చర్చిలపై దాడులు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతునే ఉన్నాయని పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ద్వారా తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఒక డిజిటల్ ఆర్ట్‌వర్క్ అయినప్పటికీ, 2018లో బీజింగ్ నగరంలోని బీజింగ్ జియాన్ చర్చిపై దాడి చేసి ఇదే విధంగా తగలపెట్టినట్టు తెలిసింది.

చివరగా, చైనాలో క్రైస్తవ మతాన్ని రద్దు చేస్తున్నట్టు చైనా ప్రభుత్వం ఇటీవల ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll