Fake News, Telugu
 

ఇటీవల వయనాడ్‌లో జరిగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీలో ఉన్న IUML పార్టీ జెండాను పాకిస్థాన్ జెండా అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇటీవల 15 అక్టోబర్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను, దేశంలోని ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ 23 అక్టోబర్ 2024న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు భారీ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించాయి. ఈ సందర్భంలో, “ప్రియాంక గాంధీ వయనాడ్ MP నామినేషన్ ర్యాలీలో పాకిస్థాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు” అని చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఇటీవల వయనాడ్‌లో జరిగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీలో ఉన్న జెండా పాకిస్థాన్ జెండా కాదు; అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా. IUML కేరళకు చెందిన రాజకీయ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భాగస్వామిగా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, 23 అక్టోబర్ 2024న రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన లైవ్ స్ట్రీమ్ వీడియోకు దారితీసింది. 

వైరల్ వీడియోలో కనిపించే జెండాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ జెండాలు కేరళకు చెందిన రాజకీయ పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి చెందినవని మేము కనుగొన్నాము. IUML కేరళకు చెందిన రాజకీయ పార్టీ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో IUML భాగస్వామి. వైరల్ వీడియోలోని జెండాలు మరియు IUML పార్టీ జెండా మధ్య పోలికను క్రింద చూడవచ్చు.

ఇంతకుముందు వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు ఊపారని క్లెయిమ్ చేస్తూ వీడియో వైరల్ అయినప్పుడు వాటిని Factly ఫ్యాక్ట్-చెక్ చేసింది. వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ చదవవచ్చు.

చివరగా, ఇటీవల వయనాడ్‌లో జరిగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీలో ఉన్న IUML పార్టీ జెండాను పాకిస్థాన్ జెండా అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll