Fake News, Telugu
 

‘క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించాను. హిందూ సంస్కృతి గొప్పతనం తెలిసాక, నిజమైన స్త్రీగా పునర్జన్మ పొందాను,’ అని సన్నీ లియోన్ అనలేదు

0

క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించి అదే జీవితం అనుక్కున్నాను. కానీ, హిందూ సంస్కృతిలో స్త్రీకి ఉన్న గొప్పదనం తెలిసాక, మనిషిగా మారి, నిజమైన స్త్రీగా పునర్జన్మ పొందాను. ఆ పాపి జీవితాన్ని వదిలేసాక గానీ తెలియలేదు. హిందూ ధర్మ విలువ, ఈ ప్రకృతిలో పరమాత్మను కొలిచే సంప్రదాయం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే హిందూ ధర్మాన్ని స్వీకరించాను”, అని నటి సన్నీ లియోన్ వ్యాఖ్యలు చేసినట్టు చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్:  క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించాను, హిందూ సంస్కృతి గొప్పతనం తెలిసాక, నిజమైన స్త్రీగా పునర్జన్మ పొందానని సన్నీ లియోన్ సన్నీ లియోన్ వ్యాఖ్యలు చేసింది.

ఫాక్ట్:  పోస్ట్‌లోని వ్యాఖ్యలు సన్నీ లియోన్ చేసినట్టుగా ఎక్కడా ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. కెనడాలోని ఒక సిక్కు కుటుంబంలో సన్నీ లియోన్ జన్మించింది. తన అసలు పేరు కరెన్‌జిత్ కౌర్. తను పోర్న్/అడల్ట్ చిత్రాలను విడిచిపెట్టినట్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఎక్కడా కూడా తను పోస్ట్‌లోని వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వ్యాఖ్యల గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి వ్యాఖ్యలు సన్నీ లియోన్ చేసినట్టుగా ఎక్కడా ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. ఒకవేళ తను నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియా ఆ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఎక్కడా కూడా ఎలాంటి న్యూస్ రిపోర్ట్స్ లభించలేదు. పోస్ట్‌లోని ఫోటో 2019 వినాయక చవితి సందర్భంగా తీసినది.

కెనడాలోని ఒక సిక్కు కుటుంబంలో సన్నీ లియోన్ జన్మించింది. తన అసలు పేరు కరెన్‌జిత్ కౌర్. సిక్కు ఆచారాలతో చేసుకున్న పెళ్లి ఫోటోని తను ట్వీట్ చేసినట్టు చూడవొచ్చు. తన భర్త క్రైస్తవుడు అయినా కారణంగా క్రైస్తవ ఆచారాల ప్రకారం కూడా తను పెళ్లి చేసుకున్న ఫోటోని తన భర్త పోస్ట్ చేసినట్టు ఇక్కడ చదవొచ్చు.

తను పోర్న్/అడల్ట్ చిత్రాలను విడిచిపెట్టినట్టు పలు సందర్భాల్లో చెప్పిందని తెలిసింది. కానీ, ఎక్కడా కూడా తను పోస్ట్‌లోని వ్యాఖ్యలు చేయలేదు. తన కొన్ని ఇంటర్వ్యూలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

అప్పటివరకు ఆశీర్వాదం పొందడానికి తను ఎప్పుడు కూడా హిందూ దేవాలయానికి వెళ్లలేదని 2013లో సన్నీ లియోన్ చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవొచ్చు. తన దగ్గర ఎప్పుడూ చిన్న గణపతి విగ్రహం ఉంటుందని పెట్టిన పోస్ట్‌లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. హిందూ పండగలేకే కాదు, క్రిస్మస్ పండగకి కూడా తను శుభాకాంక్షలు పెట్టినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించాను. హిందూ సంస్కృతి గొప్పదనం తెలిసాక, నిజమైన స్త్రీగా పునర్జన్మ పొందాను,’ అని సన్నీ లియోన్ వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll