Fake News, Telugu
 

పాత ఫోటోని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని దేవాలయాలలో అన్ని కులాలకు చెందిన వ్యక్తులని అర్హులను చేస్తూ ఆదేశాలు జారీ చేసి, పలువురు ఇతర కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించింది. ఐతే ఈ నేపథ్యంలోనే ఒక అర్చకుడు దేవుడి విగ్రహాంపై కాలు పెట్టిన ఫోటోని తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలకి ముడిపెడుతూ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించి  నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులో ఇటీవల అర్చకుడు దేవుడి విగ్రహాంపై కాలు పెట్టిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఇది పాత ఫోటో, ఈ ఫోటో ఫిబ్రవరి 2020 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఐతే ఈ ఫోటోలోని ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ ఫోటోకి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇది పాత ఫోటో, ఈ ఫోటోకి ఇటీవల అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి  అర్హులను చేస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని 2020లో షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు అనేకం మాకు కనిపించాయి. ఈ పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ ఫోటోలోని ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమాచారం మాకు తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ ఫోటోకి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి  అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమయానికి ఈ ఆదేశాలు అమలు కాలేదు, పైగా డిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.

చివరగా, పాత ఫోటోని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి  అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll