Fake News, Telugu
 

ఈ వీడియోలో అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పట్టుబడ్డది ఆనంద్ స్వరూప్ మహారాజ్ కాదు, శ్రీలంకకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి

0

ముస్లింలు మరియు క్రైస్తవులు భారతదేశం నుండి వెళ్లిపోవాలని ప్రబోధించిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు హిందూ బాబా స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ శ్రీలంకలో వేశ్యలతో పట్టుబడ్డాడు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ శ్రీలంకలో వేశ్యలతో పట్టుబడ్డ వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్నది శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ కాదు, పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి. ఈ వార్తను అక్కడి వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఇదిలా ఉండగా శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ మహారాజ్ ఇలా అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పట్టుబడట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియో చివర్లో సెక్యులరిజం, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడింది శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ మహారాజ్ అయినప్పటికీ, వీడియో మొదట్లో అమ్మాయిలతో పట్టుబడ్డది స్వరూప్ మహారాజ్ కాదు. అసలు ఈ వీడియోతో స్వరూప్ మహారాజ్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటన జరిగింది శ్రీలంకలో, వీడియోలో అమ్మాయిలతో కనిపించింది పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి.

ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇటీవల కాలంలో ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు శ్రీలంక వార్తా కథనాలు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం వీడియోలో ఉన్నది పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి. శ్రీలంకలోని నవగమువా ప్రాంతంలో ఇతను ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు నివాసంలోకి చొరబడి వీరిపై దాడి చేసారు.

ఈ సమయంలో వీరు వీడియోలు కూడా తీసారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే. ఐతే ఆ తరవాత పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. దీన్నిబట్టి ఈ వీడియోతో భారత్‌కు చెందిన ఆనంద్ స్వరూప్ మహారాజ్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ మహారాజ్ ఇలా అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పట్టుబడట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాబట్టి సంబంధం లేని వీడియోను స్వరూప్ మహారాజ్‌కు ఆపాదిస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఈ వీడియోలో అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పట్టుబడ్డది శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ మహారాజ్ కాదు, శ్రీలంకకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి.

Share.

About Author

Comments are closed.

scroll