Fake News, Telugu
 

ఒకప్పుడు కూడా వివిధ దేశాలకు భారతదేశం అప్పులు ఇచ్చింది, ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు నుండి భారతదేశం అప్పులు తీసుకుంటుంది

0

కొన్ని దేశాలకు భారతదేశం ఋణాలు ఇచ్చిన ఉదాహరణలు చెప్తూ, ‘ఒకప్పుడు అప్పులు తీసుకునే భారత్ ఇప్పుడు అప్పులు ఇస్తుంది’ అని ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒకప్పుడు అప్పులు తీసుకనే భారత్ ఇప్పుడు అప్పులు ఇస్తుంది. 

ఫాక్ట్ (నిజం): ఒకప్పుడు కూడా వివిధ దేశాలకు భారతదేశం అప్పులు ఇచ్చింది, ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు నుండి భారతదేశం అప్పులు తీసుకుంటుంది. కావున పోస్ట్ లో కేవలం మోడీ ప్రభుత్వంలోనే అప్పులు ఇస్తునట్టు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పినట్టు శ్రీలంక కు 450 మిలియన్ డాలర్లు, రష్యా కు 1 బిలియన్ డాలర్లు, పసిఫిక్ దీవులకు 150 మిలియన్ డాలర్లు మరియు మంగోలియాకు 1.2 బిలియన్ డాలర్లు ‘Line of Credit’ ని భరతదేశం ప్రకటించినట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

కానీ, ఇంతకు ముందు కూడా చాలా దేశాలకు భరతదేశం ‘Line of Credit’ ని (ఋణం) ఇచ్చింది. తాజాగా లోక్ సభలో అడిగిన ప్రశ్నకు వీ. మురళీధరన్ (Minister of State in the Ministry of External Affairs) సమాధానమిస్తూ 2010-19 సంవత్సరాల మధ్య 168 ‘Line of Credit’ లను వివిధ దేశాలకు ఇచ్చినట్టు తెలిపారు. ఆ సమాధానంలో వివిధ దేశాలకు గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన ‘Line of Credit’ వివరాలు కూడా చూడవొచ్చు. అంతేకాదు, ‘EXIM బ్యాంకు’ వెబ్ సైట్ లో సంవత్సరాల వారీగా వివిధ దేశాలకు ఇచ్చిన ‘Line of Credit’ వివరాలు చూడవొచ్చు. కావున, భారతదేశం ఇప్పుడే కాదు, ఇంతకముందు ప్రభుత్వాల్లో కూడా అప్పులు ఇచ్చింది. వివిధ దేశాలకు ఇచ్చిన ‘Line of Credit’ మరియు ‘Grants & Loans’ వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

పోస్టులో ‘ఒకప్పుడు అప్పులు తీసుకనే భారత్’ అని రాసి ఉంది. అయితే, ఇప్పటికి కూడా ప్రపంచ బ్యాంకు నుండి భారతదేశం అప్పులు తీసుకుంటుంది. ఇంతకు ముందు కూడా ప్రపంచ బ్యాంకులో భారతదేశం అప్పులు మొత్తం తీర్చేసినట్టు కొందరు సోషల్ మీడియా లో పోస్ట్ చేసినప్పుడు, FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఒకప్పుడు కూడా వివిధ దేశాలకు భారతదేశం అప్పులు ఇచ్చింది, ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు నుండి భారతదేశం అప్పులు తీసుకుంటుంది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll