Fake News, Telugu
 

వీడియోలో NRC మరియు CAAలను వ్యతిరేకిస్తూ యడ్యూరప్ప ముందు వచనానంద స్వామీ మాట్లాడలేదు

0

కర్ణాటక ముఖ్యమంత్రి ‘యడ్యూరప్ప ముందే NRC మరియు CAA ను వ్యతిరేకించిన స్వామీజీ’ అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యడ్యూరప్ప ముందే NRC మరియు CAA లను వ్యతిరేకించిన స్వామీజీ. 

ఫాక్ట్ (నిజం): వీడియోలో స్వామీజీ అసలు NRC మరియు CAA గురించి మాట్లాడలేదు. లింగాయత్ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్‌ నిరానికి మంత్రి పదవి ఇవ్వాలని వీడియోలో వచనానంద స్వామీ మాట్లాడాడు. మురుగేష్ కి మంత్రి పదవి ఇవ్వకుంటే పంచమశాలి లింగాయత్ల మద్దత్తుని యడ్యూరప్ప కోల్పోతాడని స్వామీజీ అన్నాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘yeddyurappa swamiji on stage’ అని వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి.

వీడియోలో వచనానంద స్వామీ మాట్లాడుతూ ‘లింగాయత్ వర్గానికి చెందిన 13 మంది శాసనసభ్యులు ఉన్నారు. వారిలో కనీసం ముగ్గురికి అయినా మంత్రి పదవులు ఇవ్వాలి. మాజీ మంత్రి మురుగేష్‌ నిరాని చాలా సహాయం చేసాడు, తనకు కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలి. మీరు మంత్రి పదవి ఇవ్వకుంటే, వీరశైవ లింగాయత్ పంచమశాలి వర్గం మొత్తం మీకు మద్దతు ఉపసంహరించుకుంటుంది’ అని యడ్యూరప్ప తో అన్నట్టు ‘Indian Express’ ఆర్టికల్ లో చదవొచ్చు. ఈ విషయంపై ‘ANI’ చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు. ఈ ఘటన పై వివధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలో స్వామీజీ అసలు NRC మరియు CAA గురించి మాట్లాడలేదు.

చివరగా, వీడియోలో NRC మరియు CAA లను వ్యతిరేకిస్తూ యడ్యూరప్ప ముందు వచనానంద స్వామీ మాట్లాడలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll