Fake News, Telugu
 

ఈ పోస్ట్ లోని అన్నీ ఫోటోలు తాజాగా భైంసాలో జరిగిన అల్లర్లకు సంబంధించినవి కావు

0

తాజాగా భైంసా లో జరిగిన అల్లర్లకు సంబంధించి కొందరు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా భైంసా లో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్: ఒక్క ఫోటోని మినహాయిస్తే, పోస్ట్ లోని మిగితా అన్నీ ఫోటోలు తాజా భైంసా అల్లర్లకు సంబంధించినవి కావు. రెండు ఫోటోలు అసలు భైంసా కి సంబంధించినవే కావు; 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవి. ఇంకో రెండు ఫోటోలు భైంసా లో జరిగిన పాత అల్లర్లకు సంబంధించినవి. కావున, పోస్ట్ లో అన్నీ ఫోటోలు తాజాగా భైంసా అల్లర్లకు సంబంధించినట్టు షేర్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోలు తాజా భైంసా అల్లర్లకు సంబంధించినవో లేవో ఒక్కొక్కటి తీసుకొని తెలుసుకోవడానికి  ప్రయత్నిద్దాం.

ఫోటో 1:

ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటో 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిందని చెప్తూ ‘Al Jazeera’ వారు ఫిబ్రవరి 2020 లో ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఇదే ఫోటోని ‘Getty Images’ వెబ్సైటులో కూడా చూడవొచ్చు. కాబట్టి, ఇది భైంసా కి సంబంధించిన ఫోటో కాదు.

ఫోటో 2:

ఈ ఫోటో కూడా ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఫోటో అని చెప్తూ వివిధ వార్తాసంస్థలు ఫిబ్రవరి 2020 లో ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, ఈ ఫోటో కూడా భైంసా కు సంబంధించిన ఫోటో కాదు.

ఫోటో 3:

ఈ ఫోటోని ‘The News Minute’ వారు జనవరి 2020 లో అప్పుడు జరిగిన భైంసా అల్లర్ల పై రాసిన ఆర్టికల్ లో చూడవొచ్చు. 2020 లో కూడా భైంసా లో అల్లర్లు జరిగాయి. కాబట్టి, ఈ ఫోటో భైంసా కు సంబంధించిన పాత ఫోటో.

ఫోటో 4:

ఈ ఫొటలో ఉన్న ఆర్టికల్ ఎవరు ఎప్పుడు ప్రచురించారో ఖచ్చితమైన సమాచారం దొరకలేదు. అయితే, అలాంటి పదాలతో అదే వార్తను గత సంవత్సరం భైంసా అల్లర్ల కు సంబంధించి ‘Op India’ వారు ఫిబ్రవరి 2020 లో రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, ఈ ఫోటోలో ఉన్న వార్త కూడా తాజా భైంసా అల్లర్ల కు సంబంధించింది కాదు.

ఫోటో 5:

ఈ ఫోటో ఒక్కటి తాజా భైంసా అల్లర్ల కు సంబంధించింది. తాజా భైంసా అల్లర్లలో గాయపడిన వారిని బీజేపీ నేతలు బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి ఆసుపత్రిలో కలిసినప్పుడు తీసిన ఫోటోల్లో పోస్ట్ లోని ఫోటోలో ఉన్న వ్యక్తి మరియు అవే పరిసరాలు చూడవొచ్చు. తాజా భైంసా అల్లర్ల కు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని అన్నీ ఫోటోలు తాజాగా భైంసా లో జరిగిన అల్లర్లకు సంబంధించినవి కావు.

Share.

About Author

Comments are closed.

scroll