Fake News, Telugu
 

కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు

0

కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి దాని వల్ల ఒంట్లో అయస్కాంత శక్తులు వస్తున్నాయని చెప్తూ, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్నిటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలోని వ్యక్తులు కొందరు నిజంగానే కోవిడ్-19 వాక్సిన్ వేసుకున్నట్టు తెలిసింది. అయితే, కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల అలాంటి అయస్కాంత శక్తులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

క్లెయిమ్: కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తు వస్తుంది.

ఫాక్ట్:  కోవిడ్-19 వాక్సిన్ కనుగొనక ముందు నుండి శరీరానికి వస్తువులు అతుకుతున్న వేరే చాలా వీడియోలు ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో ఎలాంటి అయస్కాంత శక్తి రాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సీడీసీ వారు వివరణ ఇచ్చారు. శరీరం పై తేమ మరియు ఇతర కారణాల వల్ల వస్తువులు అతుక్కోవచ్చు, కానీ వ్యాక్సిన్ వల్ల అయస్కాంత శక్తి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వివిధ నిపుణులు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

శరీరానికి వస్తువులు అతుకుతున్న విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కోవిడ్-19 వాక్సిన్ కనుగొనక ముందు నుండి కూడా అలాంటి వేరే చాలా వీడియోలు ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. వాటిలో కొన్నిటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, తాను వ్యాక్సిన్ తీసుకోలేదని, అయినా కానీ తన శరీరానికి వస్తువులు అతుకుతున్నాయని, వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తి వస్తున్న వార్తలు నమ్మకండి అని ఒక వ్యక్తి పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో ఎలాంటి అయస్కాంత శక్తి రాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.

అయస్కాంత శక్తి పెంపొందించేలా కోవిడ్-19 వ్యాక్సిన్ లో ఎలాంటి పదార్థాలు ఉండవని అమెరికాకి చెందిన సీడీసీ వారు కూడా తెలిపారు.

కోవిడ్-19 వ్యాక్సిన్ ని చాలా తక్కువ మోతాదులో ప్రజలకు ఇస్తారని, ఒక వేల నిజంగానే వ్యాక్సిన్ లో అయస్కాంతపు పదార్థాలు ఉన్నా, వాటివల్ల శరీరంపై వస్తువులు అతుక్కునే శక్తి రాదని వివిధ నిపుణులు చెప్తున్న వీడియోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. శరీరం పై తేమ మరియు ఇతర కారణాల వల్ల వస్తువులు అతుక్కోవచ్చు, కానీ వ్యాక్సిన్ వల్ల అయస్కాంత శక్తి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వారు తెలిపారు.

చివరగా, కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll