Fact Check, Fake News, Telugu
 

లంచం తీసుకున్న వారికి 35 సంవత్సరాలు జైలు శిక్ష అన్న వార్తలో నిజం లేదు

0

లంచం ఇచ్చిన వారికి 7 సంవత్సరాలు, లంచం తీసుకున్న వారికి 35 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: లంచం ఇచ్చిన వారికి 7 సంవత్సరాలు, లంచం తీసుకున్న వారికి 35 సంవత్సరాలు జైలు శిక్ష.

ఫాక్ట్(నిజం): అవినీతి నిరోధక చట్టం (సవరణ)-2018 ప్రకారం లంచం ఇచ్చిన వారు కూడా కనిష్టంగా 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు శిక్షార్హులు. లంచం తీసుకున్నవారికి 35 సంవత్సరాల జైలు శిక్ష అన్న వాదనలో నిజం లేదు. లంచం ఇచ్చిన వారు చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం కనిష్టంగా 6 నెలల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు శిక్షార్హులు కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

భారత దేశంలో అవినీతకి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు ఇండియన్ పీనల్ కోడ్,1860 మరియు అవినీతి నిరోధక చట్టం-1988 కింద శిక్షార్హులు.

ఇండియన్ పీనల్ కోడ్,1860 (సెక్షన్-171e):

Punishment for bribery–Whoever commits the offence of bribery shall be punished with imprisonment of either description for a term which may extend to one year, or with fine, or with both.

అవినీతి నిరోధక చట్టం-1988:

  • ఈ చట్టంలోని మూడోవ చాప్టర్ (Offences & Penalties) లో ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు విదించే శిక్షల గురించి వివరంగా ఉంది.    
  • సెక్షన్-7: Public servant taking gratification other than legal remuneration in respect of an official act.
  • సెక్షన్ -8: Taking gratification, in order, by corrupt or illegal means, to influence a public servant.
  • సెక్షన్ -9: Taking gratification, for the exercise of personal influence with public servant.
  • సెక్షన్ -10: Punishment for abetment by public servant of offences defined in section 8 or 9.
  • సెక్షన్ -11: Public servant obtaining valuable thing, without consideration from person concerned in proceeding or business transacted by such public servant.
  • సెక్షన్ -12: Punishment for abetment of offences defined in section 7 or 11.

పైన పేర్కొన్న సెక్షన్ల ప్రకారం శిక్షా కాలం కనీసం 6 నెలల నుండి 10 సంవత్సరాలు, ఒక్కొసారి ఫైన్, శిక్ష రెండు కూడా విధిస్తారు. ఐతే ఈ చట్టంలో లంచం ఇచ్చిన వారి గురించి ప్రస్తావించలేదు.

అవినీతి నిరోధక చట్టం (సవరణ)-2018:

అవినీతి నిరోధక చట్టం 1988కి  2018లో కొన్ని సవరణలు చేసి అవినీతి నిరోధక చట్టం (సవరణ)-2018ని తీసుకువచ్చారు. ఈ సవరణల ప్రకారం ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే అది ఏ ఉద్దేశంతో తీసుకున్నారో (లంచంగానే తీసుకున్నారా లేదా) అన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ ముందుగా తేల్చాలి.

ఈ చట్టంలో ప్రత్యేకంగా లంచం ఇచ్చిన వారి గురించిన వారి గురించి కూడా ప్రస్తావించారు. ఈ చట్టంలోని సెక్షన్ 8  ప్రకారం లంచం ఇచ్చేవారు కూడా ఇకనుండి కనీసం 3 సంవత్సరాలు నుండి 7 సంవత్సరాల వరకు శిక్షార్హులవుతారు, ఒక్కొసారి ఫైన్, శిక్ష రెండు కూడా విధిస్తారు.

చివరగా, అవినీతి నిరోధక చట్టం(సవరణ)-2018 ప్రకారం లంచం తీసుకున్నవారు, ఇచ్చినవారు ఇద్దరు కనీసం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు శిక్షార్హులు, ఒక్కొసారి ఫైన్, శిక్ష రెండు కూడా విదించే అవకాశం ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll