Fake News, Telugu
 

నేపాల్ లో పడిన రాళ్ల వర్షం వీడియోని వేరు వేరు ప్రాంతాలకి సంబంధించిన వీడియోగా షేర్ చేస్తున్నారు

0

‘వరంగల్ జిల్లా లో పడిన రాళ్ళ వర్షం’ అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ‘వరంగల్ జిల్లా లో పడిన రాళ్ళ వర్షం’ కి సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియో వరంగల్ కి సంబంధించింది కాదు. 18 ఏప్రిల్ 2020న నేపాల్ లో ని గహాలి గ్రామంలో రాళ్ల వర్షం పడుతుంటే ‘దివాకర్ బర్తవుల’ అనే అతను ఆ వీడియో తీసాడు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లో పెట్టిన వీడియో యొక్క  స్క్రీన్ షాట్స్ ని గూగుల్ లో వెతికితే అదే వీడియో పెట్టి  ఆ రాళ్ల వర్షం చండీఘడ్ లో పడిందనికొంత మంది పోస్ట్ (ఆర్కైవ్డ్) చేస్తే, ఇంకొంత మంది త్రిపుర లో పడిందని పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు. ఇంకొందరెమో అది  వియత్నాం లో పడిందని చేసిన పోస్ట్ లు సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించాయి. ఆ పోస్ట్  కింద  ‘vietnamnews’ అనే ఒక న్యూస్ పేపర్ వారు తమ అఫీషియల్  ట్విట్టర్  అకౌంట్ లో 24 ఏప్రిల్ 2020న అదే వీడియో ను ట్వీట్  చేసి  గత రెండు రాత్రులు గా (అంటే ఏప్రిల్ 22-23) పశ్చిమ వియత్నాం లో రాళ్ల వర్షం పడిందని పేర్కొన్నారు.

కానీ, అదే వీడియోని ఒక Facebook  యూసర్ 19 ఏప్రిల్ 2020న పోస్ట్ చేసి అది నేపాల్ లోని చిత్వాన్ లో పడిన రాళ్ల వర్షం అని పెట్టడం ఇక్కడ చూడవచ్చు. దీనిని బట్టి ఆ వీడియో వియత్నం లో ఏప్రిల్ 22-23 మధ్య పడిన రాళ్ల  వర్షం కి సంబంధించిన వీడియో కాదని అర్ధం అవుతుంది. ఆ వీడియోని అసలు 19 ఏప్రిల్ 2020 ముందు  మొదటి సారిగా ఇంటర్నెట్ లో ఎప్పుడు పోస్ట్ చేసారో తెలుసుకోవడానికి  గూగుల్ లో ఆ తేదీ తో టైం స్టాంప్ పెట్టి వెతికితే 18 ఏప్రిల్ 2020న ‘diwakarbartaula’ అనే ఒక TikTok యూసర్ పోస్ట్ చేసిన అదే వీడియో కనిపించింది. ఆ పోస్ట్ లో అతను నేపాల్, చిత్వాన్ అని పెట్టడం చూడవచ్చు. 19 ఏప్రిల్ 2020న ఫేస్బుక్ లో పెట్టిన వీడియోలో కూడా ‘diwakarbartaula’ అనే ఒక TikTok యూసర్ ఐడి కనిపిస్తుంది.

ఆ వీడియో పెట్టిన TikTok యూసర్ ‘దివాకర్ బర్తవుల’ ని ‘fact crescendo’ వారు సంప్రదించగా, అతడు ఆ వీడియోని 18 ఏప్రిల్ 2020న తన గ్రామమైన గహాలి లో రాళ్ల వర్షం పడినప్పుడు తన వరి పొలాల మధ్య  ఆ వీడియో తీసినట్టు తెలిపాడు. ఇదే విషయాన్ని ధ్రువీకరించడానికి ‘fact crescendo’ వారు అతన్ని ఆ వైరల్ వీడియో తీసిన స్థానం నుండే వీడియో తీసి పంపమంటే అతడు పంపించిన వీడియోను ‘fact crescendo’ ఆర్టికల్ లో చూడవచ్చు. దీనిని బట్టి పోస్ట్ లో ఉన్న వీడియో నేపాల్ లోని  గహాలి గ్రామం లో రాళ్ల వర్షం పడినప్పుడు తీసింది అని నిర్ధారించొచ్చు.

చివరగా, నేపాల్ లోని  గహాలి గ్రామంలో రాళ్ల వర్షం పడుతున్నప్పుడు తీసిన వీడియోని వేరు వేరు ప్రాంతాల్లో పడిన రాళ్ల వర్షం అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll