Fake News, Telugu
 

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు బ్రహ్మ గుడి (రాజస్తాన్) మెట్ల మీద పూజలు చేసుకుంది దళితులని వారిని గుడి యాజమాన్యం అనుమతించకపోవడం వల్ల కాదు

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కుటుంబం దళిత వర్గానికి చెందడం వల్ల రాజస్తాన్ లోని బ్రహ్మ గుడి యాజమాన్యం వారిని లోపలి అనుమతించలేదని, దాంతో వారు గుడి మెట్ల వద్దనే పూజ చేసుకున్నారని చెప్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణ లో రాంనాథ్ కోవింద్ భార్య సవిత కి బ్రహ్మ గుడి మెట్లు ఎక్కడానికి సమస్యగా ఉండడం వల్ల వారు ఆలయం వెలుపలే పూజ చేసుకున్నట్లుగా తెలిసింది. అంతేకాదు, ‘The Wire’ సంస్థ వారు 2018 లో బ్రహ్మ గుడి పురోహితులను సంప్రదించినప్పుడు, వారు కూడా అదే విషయం తెలిపి, కోవింద్ కూతురు స్వాతి గర్భ గుడి లోపలికి వెళ్లి దర్శనం చేస్కున్నట్లుగా తెలియజేసారు. ఫోటో సోషల్ మీడియా లో తప్పుడు ఆరోపణలతో చలామణీ అవుతుండడంతో, రాష్ట్రపతి కోవింద్ కి సమయం లేకపోవడంవల్ల వారు పూర్తి దర్శనం చేసుకోలేకపోయారని, అంతేకాని మరేయితర కారణం లేదని రాష్ట్రపతి కి ఆ సమయంలో ప్రెస్ సెక్రటరీ గా పని చేసిన అశోక్ మల్లిక్ స్పష్టం చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.hindustantimes.com/jaipur/first-family-offers-prayers-at-pushkar-ajmer-dargah/story-IxH4Gsf6TZYN0TzzUz7ZgL.html
2. న్యూస్ ఆర్టికల్ – https://www.india.com/news/india/priest-attacked-for-allegedly-stopping-president-ram-nath-kovind-from-entering-temple-in-rajasthan-3080043/
3. న్యూస్ ఆర్టికల్ – https://thewire.in/media/no-the-president-was-not-stopped-from-entering-the-pushkar-temple

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll