ఉడికించిన వెల్లుల్లి నీటిని ఉపయోగించి కొరోనా వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను నయం చేయవచ్చని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్: ఉడికించిన వెల్లుల్లి నీటి తో కొరోనా వైరస్ వ్యాధిని నయం చేయవచ్చు.
ఫాక్ట్ (నిజం): యాంటీ మైక్రోబియల్ గా వెల్లుల్లి పని చేస్తుంది, కానీ వెల్లుల్లిని తినడం ద్వారా కొరోనా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని ఎటువంటి ఆధారం లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి వెబ్సైటు లో చూడవచ్చు. కావున, పోస్ట్ లో చేసిన క్లెయిమ్ తప్పు.
కొరోనా వైరస్ ని వెల్లుల్లి ద్వారా ఎంత వరకు నిర్మూలించవచ్చు అనే విషయాన్ని ఇంటర్నెట్ లో వెతికితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు ఆ విషయం పై ఇచ్చిన వివరణ వారి వెబ్సైటు లో కనిపించింది. వెల్లుల్లి యాంటీ మైక్రోబియల్ గా పని చేస్తుంది, కానీ వెల్లుల్లిని తినడం ద్వారా కొరోనా వైరస్ నుంచి కాపాడుకోవచ్చు అనే ఆధారం లేదు అని ఉంది. అంతేకాదు, వారి వెబ్సైటు లో కొరోనా వైరస్ ని నిరోధించడానికి కానీ, నయం చేయడానికి కానీ ఇప్పటివరకు ఏ మందు లేదు అని ఉంది.
కొరోనా వైరస్ మీద ఉన్న ఇతర అపోహల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెబ్సైటు లో ఇచ్చిన వివరణను కింద చూడవచ్చు.
చివరగా, ‘వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, కానీ కొరోనా వైరస్ వ్యాధిని నయం చేస్తుందని ఆధారాలు లేవు’ అని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?