Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో రోడ్డుపై సింహాలు కూర్చున్న పాత ఫోటో పెట్టి, లాక్ డౌన్ లో శ్రీశైలం అడవిలో తీసినట్టు షేర్ చేస్తున్నారు

0

రోడ్డుపై సింహాలు కూర్చున్న ఫోటో పోస్ట్ చేసి, అది లాక్ డౌన్ లో శ్రీశైలం అడవిలో తీసినట్టు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటోని సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో తీసినట్టు చెప్తున్న ఒక పాత వీడియో నుండి తీసుకున్నట్టు FACTLY విశ్లేషణలో తేలింది. ఆ వీడియోని ‘Africa Adventures’ వారు 2016 లోనే సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో తీసినట్టు షేర్ చేసారు. కావున, పోస్ట్ లోని ఫోటో శ్రీశైలంకి కానీ, తాజా లాక్ డౌన్ కి కానీ సంబంధించిన ఫోటో కాదు. అంతేకాదు, శ్రీశైలం అడవిలో సింహాలు ఉన్నట్టు ఎక్కడ కూడా సమాచారం లేదు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://youtu.be/c8i0hjegneY?t=30

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll