Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

చికెన్ లో కొరోనా వైరస్ దొరికినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అది ఒక ఫేక్ మెసేజ్.

0

చికెన్ (కోడి) లో కొరోనా వైరస్ దొరికింది, చికెన్ తినకండి అని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చికెన్ లో కొరోనా వైరస్ దొరికింది. చికెన్ తినకండి.

ఫాక్ట్ (నిజం): చికెన్ లో కొరోనా వైరస్ దొరికిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సరిగ్గా వేడి చేసి వండిన చికెన్ తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు కూడా తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

చికెన్ లో కొరోనా వైరస్ దొరికిందా అని గూగుల్ లో వెతకగా, అటువంటి సమాచారం ఎక్కడా కూడా లేదు. ఆ మెసేజ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడంతో, జీహెచ్ఎంసీ (GHMC – Greater Hyderabad Municipal Corporation) అధికారులు దాని పై స్పందిస్తూ ‘ప్రెస్ రిలీజ్’ విడుదల చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. చికెన్ లో కొరోనా వైరస్ దొరికిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ‘రానిఖేట్’ అనే వ్యాధికి సంబంధించిన ఫోటోలు అని పీ. వెంకటేశ్వర్ రెడ్డి (Chief Veterinary Officer (Rtd.) – GHMC) తెలిపారు. ప్రెస్ రిలీజ్ ని కింద చూడవొచ్చు.

సరిగ్గా వేడి చేసి వండిన చికెన్ తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు తెలిపారు. అదే విషయాన్ని జీహెచ్ఎంసీ ‘ప్రెస్ రిలీజ్’ లో కూడా చదవొచ్చు.

నోవెల్ కొరోనా వైరస్ ని డిసెంబర్ 2019 చివరి వారంలో గుర్తించారు. కానీ, పోస్ట్ లోని ఫోటోలు ఎప్పటినుండో ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, వాటికీ కొరోనా వైరస్ కి ఎటువంటి సంబంధం లేదు.

చికెన్ తో కొరోనా వైరస్ వస్తుందనే ఫేక్ మెసేజ్ లు వైరల్ అవ్వడంతో, దేశంలో చికెన్ అమ్మకాలు మరియు రేట్లు తగ్గాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ ఆర్టికల్ లో చదవొచ్చు. కాకపోతే, చైనా లో కోళ్లకు ‘H5N1 bird flu’ (కొరోనా వైరస్ కాదు) వచ్చిందని, వాటిని చంపుతున్నారని ఇక్కడ చదవొచ్చు. కానీ, బర్డ్ ఫ్లూ కీ, కొరోనా వైరస్ కి ఎటువంటి సంబంధం లేదని ‘బిజినెస్ స్టాండర్డ్’ ఆర్టికల్ లో చదవొచ్చు.

చివరగా, చికెన్ లో కొరోనా వైరస్ దొరికినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll