Fake News, Telugu
 

‘గాంధీ ఫోటోలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని 2019 లో ఐఏఎస్ అధికారి వ్యంగ్యంగా ట్వీట్ చేసింది

0

‘కరెన్సీ నోట్ల పై నుండి గాంధీ ఫోటోలు, ప్రపంచమంతా ఉన్న గాంధీ విగ్రహాలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు చేసిందని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆమెకు నిజమేంటో తెలుసు కనుక ధైర్యంగా స్వేచ్చగా బయటకు చెప్పిందని పోస్ట్ లో రాసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘గాంధీ ఫోటోలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి.

ఫాక్ట్: 2019 లో ఐఏఎస్ అధికారి నిధి చౌదరి ఆ వ్యాఖ్యలు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలు తను వ్యంగ్యంగా చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది గాంధీ గురించి తప్పుగా రాస్తున్నారని, వాటిని గాంధీ చూడకుండా చేసినందుకు గాడ్సే కి థాంక్స్ చెప్పానని 2019 లో నిధి చౌదరి వివరణ ఇచ్చింది. ఆ ట్వీట్ కి ముందు తను గాంధీ ని ప్రశంసిస్తూ వివిధ ట్వీట్లు చేసింది. కావున, ఐఏఎస్ అధికారి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను తీసుకొని, ధైర్యంగా స్వేచ్చగా అభిప్రాయం బయటకు చెప్పిందని పోస్ట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వ్యాఖ్యల గురించి ఇంటర్నెట్ లోవెతకగా, 2019 లో ఐఏఎస్ అధికారి నిధి చౌదరి ఆ వ్యాఖ్యలు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసినట్టు చెప్తూ చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. అయితే, తను ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగా చేసినట్టు తెలిసింది. పోస్ట్ లో వివరించిన ట్వీట్ కిందనే అదే రోజు మరో ట్వీట్ చేసి, సోషల్ మీడియాలో గాడ్సే కు వస్తున్న మద్దతు పై తను అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

సోషల్ మీడియాలో చాలా మంది గాంధీ గురించి తప్పుగా రాస్తున్నారని, వాటిని గాంధీ చూడకుండా చేసినందుకు గాడ్సే కి థాంక్స్ చెప్పానని 2019 లో నిధి చౌదరి ‘NDTV’ వారికి తెలిపింది. అంతేకాదు, ఆ ట్వీట్ కి ముందు తను గాంధీ ని ప్రశంసిస్తూ చేసిన వివిధ ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘గాంధీ ఫోటోలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని 2019 లో ఐఏఎస్ అధికారి వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll