Fake News, Telugu
 

భారత దేశంలో అడుగుపెడితే దిక్కులేని చావు తప్పదని రష్యా తాలిబాన్లను హెచ్చరించలేదు

0

“తాలిబాన్లకు సరైన మొగుడు మోడీయే.. భారత్‌లో అడుగు పెడితే దిక్కులేని చావు తప్పదు”, అని రష్యా ఇటీవల తాలిబాన్లను హెచ్చరించారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశంలో అడుగుపెడితే దిక్కులేని చావు తప్పదని రష్యా తాలిబాన్లను హెచ్చరించింది.

ఫాక్ట్ (నిజం): తాలిబాన్ నుంచి భారత్ మరియు మధ్య ఆసియా దేశాలకు ముప్పు ఉంటుందన్న ఉహాగానాల మధ్య భారత్, రష్యా భద్రతా సలహాదారులు 08 సెప్టెంబర్ 2021 నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, రష్యా తమ తీవ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. కానీ , భారత దేశంలో అడుగుపెడితే దిక్కులేని చావు తప్పదని రష్యా తాలిబాన్లకు ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, రష్యా తాలిబన్లను హెచ్చరిస్తూ అలాంటి వ్యాఖ్యలు ఏవి చేయలేదని తెలిసింది. ఒక వేళ రష్యా ప్రభుత్వం లేదా రష్యా ఎంబసీ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్ లో ఏ ఒక్క ఆర్టికల్ పబ్లిష్ అవలేదు.  

అఫ్గానిస్తాన్‌ దేశంలో మారుతున్న పరిస్థితులను, అలాగే తాలిబాన్ నుంచి భారత్ మరియు మధ్య ఆసియా దేశాలకు పొంచివున్న ముప్పు విషయలను చర్చించేందుకు భారత్ మరియు రష్యా భద్రతా సలహాదారులు 08 సెప్టెంబర్ 2021 నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ రష్యా దేశాల మధ్య ఉన్న తీవ్రవాద-వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో సంబంధిత దేశాల ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. కానీ, భారత దేశంలో అడుగుపెడితే దిక్కులేని చావు తప్పదని రష్యా ప్రభుత్వం తాలిబాన్లకు ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.

చివరగా, భారత దేశంలో అడుగుపెడితే దిక్కులేని చావు తప్పదని రష్యా తాలిబాన్లను హెచ్చరించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll