Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆకలి తీర్చలేక కాదు, భర్తతో గొడవ వల్ల ఒక తల్లి తన ఐదుగురు పిల్లల్ని గంగా నదిలో తోసేసింది

0

ఆకలి తీర్చలేక..ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి’ అని చెప్తూ, ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అదే వార్తను ఆంధ్రజ్యోతి వారి వెబ్సైటులో (ఆర్కైవ్డ్) కూడా చూడవొచ్చు. ‘లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక తన ఐదుగురు పిల్లల్నీ గంగపాల్జేసింది’ అని ఉంటుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆకలి తీర్చలేక ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి.

ఫాక్ట్ (నిజం): యూపీలోని భాదోహి (సంత్ రవిదాస్) జిల్లాలో ఒక తల్లి తన ఐదుగురు పిల్లల్ని గంగా నదిలో తోసేసిన మాట వాస్తవమే, కానీ తను అలా చేసింది తన పిల్లల ఆకలి తీర్చలేక కాదు, భర్తతో గొడవవల్ల. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఆ ఘటన పై మరింత సమాచారం కోసం ఇంటర్నెట్ లో వెతకగా, భాదోహి పోలీసువారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ ఘటనపై వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.  పిల్లల ఆకలి తీర్చలేక కాదు, భర్తతో గొడవవల్ల మంజు (పిల్లల తల్లి) ఆ పని చేసినట్టు భాదోహి పోలీసువారు తెలిపారు.

భర్తతో గొడవవల్ల తను ఆ పని చేసినట్టు చెప్తున్న మంజు వీడియోని కూడా భాదోహి పోలీసువారు ట్వీట్ చేసారు.

మంజుతో పోలీసులు కావాలనే అలా చెప్పిస్తున్నారని కొందరు ప్రశ్నించగా, వాటికి సమాధామిస్తూ మంజు ఇంట్లోని ఆహరం యొక్క ఫోటోలను కూడా భాదోహి పోలీసులు ట్విట్టర్ లో పెట్టారు.

నిజంగానే పోలీసువారు చెప్పినట్టు ఆకలి వల్ల కాదా అని కనుక్కోవడానికి FACTLY ఆ కుటుంబం యొక్క రేషన్ వివరాల కోసం వెతకగా, యూపీ NFSA వెబ్సైటులో ఆ కుటుంబం యొక్క రేషన్ వివరాలు దొరికాయి. ఆ కుటుంబం  NFSA నిబంధనల ప్రకారం 8 మార్చి 2020 న 14 కేజీల బియ్యం మరియు 21 కేజీల గోధుమలు తీసుకునట్టు తెలుస్తుంది.

చివరగా, ఆకలి తీర్చలేక కాదు, భర్తతో గొడవ వల్ల ఒక తల్లి తన ఐదుగురు పిల్లల్ని గంగా నదిలో తోసేసింది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll