Fake News, Telugu
 

వీడియో గేమ్ దృశ్యాలని బ్రిటీషర్లు టిప్పు సుల్తాన్ వీరత్వం పై తీసిన షార్ట్ ఫిలింలోని దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

టిప్పు సుల్తాన్ వీరత్వం గురించి బ్రిటీషర్లు తీసిన షార్ట్ ఫిలింలోని దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బ్రిటీషర్లు టిప్పు సుల్తాన్ వీరత్వం గురించి తెలుపుతూ తీసిన షార్ట్ ఫిలింలోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నవి, Assassin’s Creed-III అనే వీడియో గేమ్ యొక్క ట్రైలర్ లోని దృశ్యాలు. 1775లో అమెరికన్ కాలనీల స్వాతంత్ర్యం కోసం కాన్నోర్ అనే ఒక వీరుడు బ్రిటిష్ సైన్యం తో పోరాటం చేయడం ఈ వీడియో గేమ్ యొక్క నేపథ్యం. ఈ వీడియో టిప్పు సుల్తాన్ కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Ubisoft North America’ యూట్యూబ్ ఛానల్ 05 జూన్ 2012 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని, ‘Assassin’s Creed III: E3 Cinematic Trailer’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నవి ‘Assassin’s Creed III’ వీడియో గేమ్ యొక్క ట్రైలర్ లోని దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. 

ఆ వీడియో గేమ్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం కీ పదాల ఉపయోగించి వెతకగా, ఆ వీడియో గేమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ‘Ubisoft’ వెబ్సైటులో లభించాయి. 1775లో అమెరికన్ కాలనీల స్వాతంత్ర్యం కోసం కాన్నోర్ అనే వీరుడు బ్రిటిష్ సైన్యం తో పోరాటం చేయడమే ఈ వీడియో గేమ్ యొక్క నేపథ్యం. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలు ‘Assassin’s Creed III’ వీడియో గేమ్ కి సంబంధించినవని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, వీడియో గేమ్ దృశ్యాలని బ్రిటీషర్లు టిప్పు సుల్తాన్ వీరత్వం పై తీసిన షార్ట్ ఫిలింలోని దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll